ఐసిస్‌కు మ‌ద్ద‌తివ్వ‌ట్లేద‌ని న‌గ‌ర లెక్చ‌ర‌ర్‌ను చంపేశారా?

isis muslim

ట్విట్టర్‌లో ఓ లెక్చరర్ పోస్ట్ చేసిన ఐసిస్ ప్రస్తావనతో హైదరాబాద్‌లో మళ్లీ ఐసిస్ కదలికలపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని ఎంఎస్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ అనుమాన‌స్ప‌ద రీతిలో మృతిచెందారు. గత మంగళవారం సాయంత్రం గం. 530లకు కళాశాల నుంచి వెళ్లాడు. అదే రోజు వరంగల్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే ప్రవీణ్‌కుమార్‌కు ఐసిస్ బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

గుర్తు తెలియని కొందరు అంటే.. ఐసిస్ అనుమానితులు అనుకుంటా..అంటూ తనను బెదిరించినట్టు ట్విట్టర్‌లో పోస్టు చేసినట్టు అతని స్నేహితులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో చాదర్‌ఘాట్‌లోని ఎంఎస్ కళాశాలో ఐసిస్ కలకలం రేగింది. బాగ్‌లింగంపల్లికి చెందిన కె ప్రవీణ్‌కుమార్ ఎంఎస్సీ చదివారు. జూన్ 2013లో ముషీరాబాద్‌లోని ఎంఎస్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా చేరారు. రెండేళ్ల క్రితం అక్కడి నుంచి చాదర్‌ఘాట్‌లోని ఎంఎస్ కళాశాలకు బదిలీ అయ్యారు.ఇదిలావుండగా ప్రవీణ్ ట్విట్టర్‌పై దర్యాప్తు జరుపుతున్నట్టు చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.

NO COMMENTS

Leave a Reply