రూ.251 ఫోన్ దుకాణం బందయింది

freedom-251

కొద్దికాలం క్రితం కేవలం రూ.251 కే ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ అప్పట్లో సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ కంపెనీ గుర్తుందా..? ఆ రింగింగ్ బెల్స్ ఖేల్ ఖతమైనట్టేనని తెలుస్తోంది. ఎలా అంటే..ఆ కంపెనీకి చెందిన వార్త ఒకటి మనకు ప్రధానంగా వినబడుతోంది. ఆ కంపెనీ పని అయిపోయిందని, దాని ఎండీ మోహిత్ గోయల్ తప్పుకోవడంతో రింగింగ్ బెల్స్ దాదాపుగా మూత పడినట్టేనని తెలుస్తోంది. దీనికి తోడు అతని భార్య, రింగింగ్ బెల్స్ డైరెక్టర్లలో ఒకరైన ధర్న గోయెల్ కూడా తన పదవి నుంచి తప్పుకుందని సమాచారం.

ఇక్క‌డితో ఈ క‌థ అయిపోలేదు. వీరిద్దరూ కలిసి ఎండీఎం అనే మరో నూతన కంపెనీ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. కాగా అప్పట్లో రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని చెప్పి రింగింగ్ బెల్స్ వివాదాల్లో చిక్కుకోగా, లాటరీ ప్రాతిపదికన 70వేల ఫోన్లను అందించామని కంపెనీ చెప్పుకొచ్చింది. కానీ దీనిపై యూజర్లు అస్సలు స్పందించలేదు. ఈ క్రమంలో రింగింగ్ బెల్స్ గురించి తాజాగా తెలుస్తున్న సమాచారం చర్చనీయాంశంగా మారింది.

NO COMMENTS

Leave a Reply