ఉన్న‌ది ఉన్న‌ట్లు తీసే ద‌మ్ముందా ?

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీస్తానంటే తాను ఆనందంగా ఆహ్వానిస్తున్నాను. ఈ విష‌యంలో బాల‌కృష్ణ‌ను అభినందిస్తాను. ఎన్టీఆర్ కుమారుడిగా జ‌న్మించినందుకు అది నీ అదృష్టం కూడా. తీస్తె జ‌రిగింది జ‌రిగిన‌ట్టు సినిమాగా తీయండి. లేదంటే ఎన్టీఆర్ సాధించిన విజ‌యాల‌ను మాత్ర‌మే సినిమాగా తీయండి. అంతే కానీ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి సినిమా తీస్తే తాను కోర్టుకు వెళ్తాన‌ని ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి బాల‌కృష్ణ‌కు హెచ్చ‌రిక జారీచేసింది.

ఎన్టీఆర్ భార్య‌గా తాను బ‌తికే ఉన్నాన‌ని, చిత్ర‌క‌థ‌లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఊరుకోన‌ని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపింది. ఈ సినిమాలో ఎవ‌రిని విల‌న్ గా చూయిస్తార‌ని వ‌చ్చిన ప్ర‌శ్న‌కు ల‌క్ష్మీపార్వ‌తి అని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. దీనితో ల‌క్ష్మీపార్వ‌తి విభేధించింది. చంద్ర‌బాబు నాయుడును గొప్పోడ‌ని చూయిస్తే ఊరుకోన‌ని ఆమె అన్నారు. సాధార‌ణ కుటుంబం నుండి వ‌చ్చిన త‌న‌ను మెచ్చుకుని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నార‌ని ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు. ఎన్టీఆర్ కు జ‌రిగిన అన్యాయాన్ని చూయించాల‌ని, త‌న‌ను విల‌న్ చేసి .. చంద్ర‌బాబును హీరోను చేస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

NO COMMENTS

Leave a Reply