కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు

ఖ‌మ్మం జిల్లా కొత్తగూడెం విమానాశ్ర‌యానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు తెలంగాణ ఐటీ, మున్సిప‌ల్ శాఖా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ ఉద‌యం అశోక గ‌జ‌ప‌తి రాజుతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద ఏవియేషన్ స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహ‌కారం అందించాల‌ని కేటీఆర్ కోరారు. ఈ సమావేశంలో ప్రాంతీయ విమానయాన అనుసంధానం కింద కేంద్ర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విమానయాన రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం చాలా కీలకమైనదని తెలిపారు.

ktr ktr1

NO COMMENTS

Leave a Reply