కేటీఆర్ ఇలాంటి వాటిల్లో ముందుంటాడా?

ktr
తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, శాఖా మంత్రి కే తార‌క‌రామారావుపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. అమెరికాలో ఉద్యోగం చేసి తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొని రాష్ట్ర మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న కేటీఆర్ ఇప్ప‌టికే బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల ప్ర‌శంస‌లు పొందుతున్న సంగ‌తి తెలిసిందే. అలా ప‌రిశ్ర‌మ‌ల‌ను తెలంగాణ వైపు ర‌ప్పించ‌డంలో ముందున్న కేటీఆర్ ఇపుడు ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు తీర్చ‌డంలో ముందు ఉంటున్నార‌ని అంటున్నారు. అందుకు తాజాగా ఉదాహ‌ర‌ణ‌గా ఇది చెప్తున్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చిప్ప మనోహర్(42)కు భార్య పుష్ప, కుమారులు మహేందర్, రోహిత్, కల్యాణ్ ఉన్నా రు. మనోహర్ ఉపాధికోసం కొంతకాలం కిందట కూలీగా కువైట్ వెళ్లాడు. సరైన పని దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో దురదృష్టవశాత్తు ఓ కేసులో ఇరుక్కున్నాడు. అనారోగ్యంతో దవాఖానలో చేరగా క్యాన్సర్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి షేక్ బద్రియా దవాఖానలో చేరాడు.
ఈ విషయం తెలుసుకున్న మనోహర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం కోరారు. ఎన్నారై వ్యవహారాల మంత్రి కేటీఆర్ మెరుపువేగంతో స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితుడిని వెంటనే తెలంగాణకు రప్పించాలని, విదేశీ వ్యవహారాలశాఖతో మాట్లాడాలని ఆదేశించారు. కువైట్‌లో మనోహర్‌పై కేసు పెండింగ్‌లో ఉండటం, రూ.19 లక్షల పరిహారం చెల్లిస్తేనే స్వదేశం పంపుతామని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవతో కువైట్‌లోని ఎన్జీవోల సహకారంతో కేసు నుంచి విముక్తి కలిగింది. తెలంగాణ ఎన్నారైశాఖ అధికారుల ప్రత్యేక కృషితో మనోహర్‌ను హైదరాబాద్‌కు తీసుకొనిరానున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం నిమ్స్‌లో అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్‌కు రాగానే అంబులెన్స్‌లో నేరుగా దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించనున్నారు. మంగళవారం రాత్రే మనోహర్ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రవాస తెలంగాణవాసులకు ఎలాంటి కష్టం కలిగినా తెలంగాణ ఎన్నారైశాఖను 040-23220603 లో లేదా nri@telangana.gov.inకు ఈ మెయిల్ చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
—-

 

NO COMMENTS

Leave a Reply