రాజ‌య్య‌కు సున్నం వేసిన కేటీఆర్

ktr

హైద‌రాబాద్ అంటే హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మాత్ర‌మే కాదు. హైద‌రాబాద్ న‌గ‌రం జీహెచ్ఎంసీ నుండి హెచ్ఎండీఎగా రూపాంత‌రం చెంది కొత్త జిల్లాలు ఏర్ప‌డిన త‌రువాత 11 జిల్లాల‌కు విస్త‌రించింది. తెలంగాణ‌లో మూడో వంతు జ‌నాభా కోటి మంది ఇక్క‌డ ఉన్నారు. 40 శాతం ఆదాయం ఇక్క‌డి నుండి వ‌స్తుంది. ఈ న‌గ‌రాన్ని ఎలా అభివృద్ది చేయాలి అన్న‌ది ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌ణాళిక ఉంద‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేర‌కు శాస‌న‌స‌భ‌లో విప‌క్షాల‌కు స‌మాధానం ఇచ్చిన ఆయ‌న దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు.

సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజ‌య్య మాట్లాడిన తీరును కేటీఆర్ త‌ప్పుప‌ట్టారు. విమ‌ర్శ చేయాలి కాబ‌ట్టి విమ‌ర్శ‌, రాజ‌కీయం చేయాలి కాబ‌ట్టి విమ‌ర్శ, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కొర‌కు విమ‌ర్శ అన్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని, ఈ విధంగా తాము మాట్లాడాలి అనుకుంటే ఐదున్న‌ర ద‌శాబ్దాలుగా ఈ రాష్ట్రాన్ని ఎవ‌రు పాలించారు అన్న ప్ర‌శ్నను అడ‌గాల్సి వ‌స్తుంద‌ని, తాము ఆ విష‌యం మాట్లాడ‌మ‌ని, విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్ ను మార్చ‌డానికి త‌మ ప్ర‌ణాళిక కొన‌సాగుతుంద‌ని, అది ఒక్క రాత్రిలో కాద‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌ని కేటీఆర్ అన్నారు.

ఈ న‌గ‌రం నిర్మించిన కులీకుతుబ్ షా ఈ న‌గ‌రం న‌దిలో చేప‌ల్లా జ‌నంతో నిండిపోవాల‌ని కోరుకున్నారు. ఆయ‌న కోరుకున్న‌ట్లే ఈ న‌గ‌రం ప్ర‌జ‌ల‌తో నిండిపోయి దేశంలో, ప్ర‌పంచంలో ఓ అద్భుత న‌గ‌రంగా మారుతుంద‌ని కేటీఆర్ అన్నారు. రాజ‌కీయం కోసం విమ‌ర్శ‌లు చేయ‌డం పార్టీలు మానుకోవాల‌ని కేటీఆర్ అన్నారు.

NO COMMENTS

Leave a Reply