కొత్త‌పాత్ర‌లో మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖా మంత్రి కేటీఆర్ కొత్త పాత్ర‌లో క‌నిపించారు. నిత్యం పాల‌న‌ప‌ర‌మ‌యిన ప‌నుల్లో ప్ర‌జ‌ల్లో, అధికారుల స‌మావేశాల‌లో గ‌డిపే ఆయ‌న సాధార‌ణ తండ్రిలా త‌న కూతురు పేరెంట్ మీటింగ్ కు హాజ‌ర‌య్యారు. త‌న కూతురు అలేఖ్య ప్రొగ్రెస్ రిపోర్టును చూసి చ‌దువుకు సంబంధించిన విష‌యాల‌ను టీచ‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు.

త‌న కూతురు తాను ఊహించిన దానిక‌న్నా మెరుగ్గానే చ‌దువుతుంద‌ని ట్విట్ట‌ర్లో త‌న ఆనందాన్ని పంచుకున్నారు. శాస‌న‌స‌భ‌, రాజ‌కీయ స‌మావేశాల‌క‌న్నా పేరెంట్ – టీచ‌ర్ మీటింగ్ కు వెళ్ల‌డం ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింద‌ని ట్విట్ట‌ర్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

ktr ktr1 ktr2 ktr3

NO COMMENTS

Leave a Reply