ఆ స‌మ‌యంలో డ్రైవ‌ర్ కోసం కేటీఆర్

కేటీఆర్ లోని గొప్పద‌నానికి .. నిండు మ‌న‌సుకు నిలువుట‌ద్దంలా నిల‌బ‌డే సంఘ‌ట‌న తాజాగా చోటు చేసుకుంది. సాధార‌ణ ఉద్యోగుల‌ను పురుగుల్లా చూసే నేత‌ల‌కు భిన్నంగా మంత్రి అయిన కేటీఆర్ హైద‌రాబాద్ క్యాంపు కార్యాల‌యంలో కారు డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్న వ్య‌క్తికి ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో స్వ‌యంగా అత‌ని గురించి శ్ర‌ద్ద తీసుకుని వైద్యం అందించారు. ఆయ‌న ఆసుప‌త్రి నుండి ఇంటికి వ‌చ్చిన త‌రువాత కూడా మ‌రిచిపోకుండా మారుమూల గ్రామంలో ఉన్న అత‌ని ఇంటికి అర్ధ‌రాత్రి వెళ్లి ప‌రామ‌ర్శించారు.

సిరిసిల్ల మ౦డల౦ జెగ్గారావుపల్లికి చె౦దిన క౦చర్ల బాబు హైదరాబాదు క్యా౦పు కార్యాలయంలో కారు డ్రైవర్ గా పనివేస్తున్నాడు. ప్రమాదవశాత్తు పదిహేను రోజుల క్రితం రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి కాళ్లు, చేతులు విరిగాయి. ప్ర‌భుత్వం త‌ర‌పున వైద్యం చేయించిన కేటీఆర్ ఆసుప‌త్రిలో ఇంత‌కుముందే అత‌న్ని క‌లిసి ధైర్యం నూరిపోశారు. తాజాగా సిరిసిల్ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేటీఆర్ త‌న కార్య‌క్ర‌మాలు ముగిసిన త‌రువాత పోలీసుల‌ను కూడా ప‌క్క‌న పెట్టి నేరుగా డ్రైవ‌ర్ బాబు ఇంటికి వెళ్లారు. అత‌న్ని మ‌రో సారి క‌లిసి యోగ‌క్షేమాలు ఆరా తీశారు. కేటీఆర్ ఆ స‌మ‌యంలో ఆ ఊరికి వెళ్లి డ్రైవ‌ర్ ని ప‌రామ‌ర్శించ‌డం అంద‌రినీ క‌దిలించింది.

ktr ktr1

NO COMMENTS

Leave a Reply