కృష్ణంరాజు వార్త‌ల్లో వ్య‌క్తేనా ?!

krishnam-raju

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా మాజీ కేంద్ర‌మంత్రి, ప్ర‌ముఖ సినీన‌టుడు కృష్ణంరాజును నియ‌మిస్తున్న‌ట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ మేర‌కు బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితె అదంతా వ‌ట్టిదేన‌ని తెలుస్తోంది. ఇది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మేన‌ని అంటున్నారు.

త‌మిళ‌నాడు వంటి రాజ‌కీయ అనిశ్చితి ఉన్న రాష్ట్రంలో అనుభ‌వం లేని కృష్ణంరాజును నియ‌మించే అవ‌కాశం లేద‌ని బీజేపి వ‌ర్గాలు అంటున్నాయి. అయితె ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని, ప్ర‌భాస్ గ్లామ‌ర్ ను పార్టీకి అనుకూలంగా వాడుకునేందుకు కృష్ణంరాజుకు ఏదో ఒక ప‌ద‌వి ఇస్తె ఇవ్వొచ్చ‌న్న వాద‌న‌ను కొట్టిపారేయ‌లేమ‌ని చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటే కృష్ణంరాజు వివాదాల‌కు దూరంగా ఉండే వ్య‌క్తి కాగా .. ఎలాంటి అవినీతి మ‌ర‌క‌లు లేవ‌ని, ఆర్థికంగా కూడా లేని నేప‌థ్యంలో పార్టీ త‌ర‌పున ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తార‌ని అంటున్నారు. చివ‌రికి ఏమ‌వుతుందో గానీ ఇప్ప‌టికి మాత్రం కృష్ణంరాజు వార్త‌ల్లో వ్య‌క్తేన‌ని అంటున్నారు.

NO COMMENTS

Leave a Reply