అందుకోసం కొత్త బ‌ట్ట‌లు రెడీచేసుకుంటున్న కోమ‌టిరెడ్డి

komati reddy

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష సీటులోనుంచి ఎప్పుడుడెప్పుడూ దింపుదామా అనే బ‌ల‌మైన కోరిక‌తో ఉన్న‌ట్లున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పీసీసీ పీఠం కోసం గ‌తంలో కోమ‌టిరెడ్డి ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ విష‌యం గురించి తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ సోదరుల్లో ఎవరికి పీసీసీ చీఫ్‌ ఇచ్చినా సంతోషమేనన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదనీ, కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నదే తమ కోరికని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై ఎప్ప‌ట్లాగే కోమ‌టిరెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. గుత్తాది తన స్ధాయి కాదని, ఎంపీగా గుత్తాను రెండు సార్లు తానే గెలిపించానని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. తాను నల్లగొండ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని, గుత్తా నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయనకు పోటీగా ఒక కార్యకర్తను నిలబెడతానని ఎద్దేవా చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు పోగుట్టుకుంటే గుత్తా ఎన్నికల్లో పోటీ చేసి డబ్బు సంపాదించారని కోమ‌టిరెడ్డి ఆరోపించారు.

NO COMMENTS

Leave a Reply