రివ్యూ: కిక్ 2

kick2

సినిమా: కిక్ 2

న‌టీన‌టులు: ర‌వితేజ‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, బ్ర‌హ్మానందం, సాల్మ‌న్ సింగ్ ఠాగూర్‌, క‌బీర్‌సింగ్‌, ఆశీష్‌విద్యార్థి

సంగీతం: ఎస్ఎస్‌.థ‌మ‌న్‌

నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌

ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్‌రెడ్డి

రిలీజ్ డేట్‌: 21 ఆగ‌స్టు, 2015

ర‌వితేజ‌-సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో 2009లో వ‌చ్చిన కిక్ సినిమా ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో ర‌వితేజ కిక్కే కిక్కు అన్న డైలాగ్‌తో అద‌రగొట్టాడు. ఈ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన సినిమా కిక్ 2. కిక్ కిక్ కాన్సెఫ్ట్‌తో వ‌స్తే కిక్ 2 కంఫ‌ర్ట్ కాన్సెఫ్ట్‌తో వ‌చ్చింది. కిక్ కాంబినేష‌న్ రిపీట్ కావ‌డం, క‌ళ్యాణ్‌రామ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌డంతో కిక్ 2పై రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు ఉన్నాయి. బ‌లుపు, ప‌వ‌ర్ హిట్ల త‌ర్వాత జోష్ మీద ఉన్న ర‌వితేజకు ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ఇచ్చిందా లేదా…కిక్ 2పై ఉన్న అంచ‌నాల‌ను ఎంత వ‌ర‌కు అందుకుందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :

కిక్ సినిమాలోని ర‌వితేజ‌-ఇలియానా కొడుకు రాబిన్‌హుడ్ (ర‌వితేజ‌) క‌థే కిక్ 2. త‌న‌కు కంఫ‌ర్ట్ ముఖ్యం. కంఫ‌ర్ట్ లేకుండా చేసిన వాళ్ల‌కు చుక్కులు చూపిస్తాడు. ఇండియాలో ఆస్తుల‌మ్మేసుకుని అమెరికా వెళ్లి అక్క‌డ హాస్ప‌ట‌ల్ క‌ట్టేసి సెటిల్ అయిపోవాల‌నుకుంటాడు. అయితే అనుకోకుండా చైత్ర (ర‌కుల్‌) క‌ల‌వ‌డంతో ఆమెతో ల‌వ్‌లో ప‌డ‌తాడు. ఈ లోగా చైత్ర కిడ్నాఫ్ అవ్వడం ఆమె కోసం మ‌నోడు బీహార్‌లోని విలాస్‌పూర్ అనే గ్రామం వెళ్ల‌డం..అక్క‌డ రాబిన్‌హుడ్ లైఫ్‌లోకి సోల‌మాన్ సింగ్ ఠాగూర్ (రవికిష‌న్‌), అత‌ని కొడుకు మున్నా (క‌బీర్‌సింగ్‌) ఎంట‌ర్ అవుతారు.

           చైత్ర ఎందుకు కిడ్నాప్ అయ్యింది ? మ‌న రాబిన్‌హుడ్‌ను ఎందుకు ప్రేమించిన‌ట్టు న‌టించింది ?  విలాస్‌పూర్ ప్ర‌జ‌లు రాబిన్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు ? ఈ ట్విస్ట్‌ల‌న్నింటికి థియేట‌ర్లోనే స‌మాధానం దొరుకుతుంది.

విశ్లేష‌ణ‌:

టాలీవుడ్‌లో హీరోల‌తో పాటు హై లెవ‌ల్ టెక్నీషియ‌న్ల‌లో చాలా మంది ఒక‌టి రెండు హిట్లు రాగానే మ‌నం పైనుంచి ఊడిప‌డ్డ గ్ర‌హాంత‌ర వాసులుగా ఫీలైపోతారు. రేసుగుర్రం, టెంప‌ర్ లాంటి హిట్ సినిమాల‌కు స్టోరీ అందించిన వంశీ ఆ సినిమాల ప్ర‌భావంతో ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌గా కిక్ 2 స్టోరీ రాసేశాడు. ఎప్పుడో 1970వ ద‌శ‌కంలో వ‌చ్చిన షోలో సినిమా త‌ర‌హాలోనే ఊరి ప్ర‌జ‌ల‌ను విల‌న్ న‌ర‌క‌యాత‌న పెడుతుంటే ..హీరో వ‌చ్చి వాడ్ని చంపేయ‌డం. క‌థ ఇలా ఉంటే క‌థ‌నం కాస్త ముందుకు వ‌చ్చి 1980వ ద‌శ‌కం సినిమాల స్టైల్లో ఉంటుంది. పరాకాష్ట ఏంటంటే హీరో  హీరోయిన్ ని బజారుదానికంటే హీనం అని చెప్పి సీరియస్ గా కామెంట్ చేయడం హీరో క్యారెక్టరైజేషన్ విలన్ కన్నా బ్యాడ్ అన్నట్టుగా క‌న‌ప‌డుతుంది

 ర‌వితేజ గ‌త సినిమాల‌తో పోల్చుకుంటే కాస్త స‌న్న‌బ‌డ్డా పాట‌ల్లోను, డ్యాన్సుల్లోను ఎన‌ర్జీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ జ‌స్ట్ ఓకే. బీహారీ అమ్మాయిగా మాత్రం కాస్త త‌ళుక్కుమంది. విల‌న్లుగా చేసిన ర‌వికిష‌న్‌, క‌బీర్‌సింగ్‌లు యాక్ష‌న్ కంటే అర‌వ‌డానికే ప్రాధాన్యం ఇచ్చారు. మిగిలిన వారిలో నోరా ఫ‌తేహి అందాల ఐటెం సాంగ్‌లో మొహ‌మాటం లేకుండా అందాల‌ను బాగానే ఆర‌బోసింది. హిందీ నుంచి వచ్చిన క‌మెడియ‌న్లు రాజ్‌పాల్ యాద‌వ్‌, సంజ‌య్‌మిశ్రా ఆ క్యారెక్ట‌ర్ల‌లో పెద్ద‌గా చేసిందీ లేదు.. సూట్ అయ్యింది లేదు.

  సాంకేతిక నిపుణుల్లో థ‌మ‌న్ పాట‌లు సినిమాలోనే కాదు ఎన్నిసార్లు విన్నా ఎప్ప‌ట‌కీ గుర్తుండేలా లేవు. ఆర్ ఆర్‌పై కాస్త బుర్ర‌పెట్టిన‌ట్టున్నాడు. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస సినిమాటోగ్ర‌ఫీ మాత్రం బాగుంది. బీహార్‌లోని ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణాన్ని, యాక్ష‌న్ సీక్వెల్స్‌ను చ‌క్క‌గా ఫ్రేముల్లో బంధించాడు. రామ్‌-ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ సీక్వెల్స్ కొత్త‌గా ఉండి..ప్రేక్ష‌కుల‌ను థ్రిల్స్‌కు గురి చేశాయి. నారాయ‌ణ‌రెడ్డి ఆర్ట్ వ‌ర్క్ కూడా బాగుంది.

       గౌతంరాజు ఎడిటింగ్‌పై పెద్ద‌గా దృష్టి పెట్టిన‌ట్టు లేదు. 161 నిమిషాల సినిమాలో మ‌రో 20 నిమిషాల‌ను ట్రిమ్ చేయాల్సింది. సెకండాఫ్‌లో చాలా బోరింగ్ సీన్ల‌ను క‌ట్ చేసి ఉంటే సినిమా ఇంకా ఫాస్ట్‌గా ముందుకు క‌దిలేది. క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువ‌లు సూప‌ర్బ్‌గా ఉన్నా..అవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీర‌య్యాయి. సురేంద‌ర్‌రెడ్డి మీద న‌మ్మ‌కంతో తాను కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే సెట్స్‌కు వ‌చ్చాన‌ని చెప్పాడంటే డైరెక్ట‌ర్‌ను గుడ్డిగా న‌మ్మి మోస‌పోయాడు. ఫైన‌ల్‌గా ప్రేక్ష‌కుల‌కు డ‌బుల్ కిక్ ఇస్తుంద‌నుకున్న కిక్‌లో మామూలు కిక్ కూడా లేదు.

 ప‌ర‌మ రొటీన్ క‌థ‌తో స్టోరీ రైట‌ర్ వ‌క్కంతం వంశీ, ఆస‌క్తి లేని రొడ్డ కొట్టుడు క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి సినిమాను నాశ‌నం చేసేశారు. రేసుగుర్రం సినిమా కోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్న సురేంద‌ర్‌రెడ్డి ఈ సినిమాను మాత్రం గాలికొదిలేశాడ‌నిపిస్తుంది. సినిమాలో సినిమాటోగ్ర‌ఫీ, ఫైట్స్ త‌ప్ప సంగీతం, ఎడిటింగ్‌, మాట‌లు, స్టోరీ, డైరెక్ష‌న్ ఇలా అన్ని విభాగాలు క‌ట్ట‌క‌ట్టుకుని ఫెయిల‌య్యాయంటే సురేంద‌ర్‌రెడ్డికి ఈ విష‌యంలో సున్నా మార్కులేయాల్సిందే.

ఫ్ల‌స్‌లు

సినిమాటోగ్ర‌ఫీ

యాక్ష‌న్ సీక్వెల్స్‌

ర‌వితేజ న‌ట‌న‌

క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువ‌లు

మైన‌స్‌లు

రొటీన్ స్టోరీ

స్ర్కీన్ ప్లే, డైరెక్ష‌న్‌

ఎడిటింగ్‌

ర‌న్ టైం

ఆస‌క్తిలేని ట్విస్టులు

ఫైన‌ల్‌గా…

ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన కిక్ 2 …ప్రేక్ష‌కుల‌కు డ‌బుల్ కిక్ కాదు క‌దా మూములు కిక్ కూడా ఇవ్వ‌లేదు.

కిక్ 2 మూవీ రేటింగ్‌: 2.5

NO COMMENTS

Leave a Reply