మోడీకి హిందుత్వ క్లాసులు చెప్తున్న కేజ్రీ

modi

ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోమారు సెటైర్ల‌తో కూడిన విమ‌ర్శ‌లు చేశారు. త‌న త‌ల్లితో బ్రేక్‌ఫాస్ట్ చేశాన‌ని ప్ర‌ధాన‌మంత్రి చేసిన ట్వీట్‌పై కేజ్రీవాల్ మండిప‌డ్డారు. త‌న త‌ల్లి త‌న‌తోనే ఉంటుంద‌ని, ప్ర‌తిరోజు ఆమె ఆశీర్వాదాలు తాను తీసుకుంటాన‌ని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అస‌లు హిందూ మ‌త గ్రంథాల ప్ర‌కారం తల్లి, భార్య‌ను ప్ర‌తి వ్య‌క్తి త‌న‌తోనే ఉండ‌నివ్వాలి.. ఇప్పుడు నీ ఇల్లు చాలా పెద్ద‌దిగా ఉందిగా.. ఇప్పుడైనా ఆ ప‌ని చెయ్ అని మోడీకి సూచించారు.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌వంబ‌ర్‌లో మోడీ త‌ల్లి హీరాబెన్ త‌న ద‌గ్గ‌ర ఉన్న రూ.4500 ల‌ను బ్యాంకుకు వెళ్లి మార్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని కేజ్రీవాల్ ప్ర‌స్తావిస్తూ… ప్ర‌ధాన‌మంత్రి మోడీ త‌న త‌ల్లిని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. తన త‌ల్లిని తాను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం బ్యాంకు క్యూలో నిల‌బెట్ట‌న‌ని ప‌రోక్షంగా మోడీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

NO COMMENTS

Leave a Reply