గడ్కరీకి కేసీఆర్ వార్నింగ్

“ఆదరించిన వారిని గుండెల్లో పెట్టుకుని పూజించడం. వంచించిన వారి మీద పోరాడి సాధించుకోవడం తెలంగాణ ప్రజల వ్యక్తిత్వం. జాతీయ రహదారులతో పాటు తెలంగాణకు ఎన్నో వరాలు కురిపించిన కేంద్రమంత్రి నితీష్ గడ్కరీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు” అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ – హైదరాబాద్ రహదారి శంకుస్థాపన అనంతరం వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ గడ్కరీకి సమాధానం చెప్పుకోలేని షాక్ ఇచ్చారు.

కొత్త రాష్ట్రం అయిన తెలంగాణకు కేంద్రం మరింత సహకరించాలని, తెలంగాణను ఆదరిస్తే పూజిస్తాం ..వంచిస్తే లడాయేనని కేసీఆర్ వేదిక మీద నుండే తేల్చిచెప్పారు. తెలుగు, ఉర్ధూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గడ్కరీకి అర్ధమయ్యేలా హిందీలో మాట్లాడడం, నేరుగా కేంద్రానికి తాకే విధంగా విషయాన్ని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత మాట్లాడిన గడ్కరీ ఈ విషయాన్ని ప్రస్తావించలేక ఇబ్బందులు పడ్డారు.

gadkari gadkari1 gadkari2

 

 

NO COMMENTS

Leave a Reply