లోగుట్టు ? కేసీఆర్ కు కేంద్ర బలగాల భధ్రత తొలగింపు

kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న కేంద్ర బలగాల భద్రతను తొలగిస్తూ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఆయన భద్రత రాష్ట్ర భద్రతా బలగాలకే సంబంధమని, కేంద్ర బలగాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కేంద్రంలో కీలకంగా ఉన్న పలువురికి భద్రత తొలగించినా  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు భద్రతను ఉపసంహరించుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆయన కుటుంబంలోని 8 మందికి, మాజీ టెలికాం మంత్రి, 2జి స్పెక్ట్రం కేసు నిందితుడు రాజా, మాజీ స్పీకర్ మీరా కుమార్, ఉత్తరాఖండ్ గవర్నర్ కెకె పాల్, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, కేరళ గవర్నర్ సదాశివం, మాజీ కేంద్ర మంత్రులు జితిన్ ప్రసాద్, సుబోద్ కాంత్ సహాయ్, నారాయణ తదితరులు 30 మందికి భద్రత తొలగించారు.

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటి నుండో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఆయనకు భద్రతను తగ్గించడం గానీ, ఉపసంహరించాలన్న ఆలోచనగానీ చేయలేదు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే కేంద్రం ఎందుకు కేంద్ర బలగాల భద్రత తొలగించింది అన్నది సర్వత్రా చర్చానీయాంశం అవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకటనలో అందరికీ ఉన్న థ్రెట్ ను పరిశీలించిన తరవాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలపడం గమనార్హం.

NO COMMENTS

Leave a Reply