బ్రేకింగ్ : పండ‌గ త‌ర్వాత ప్ర‌జా ధ‌ర్భార్

KCR pension

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంక్రాంతి త‌రువాత వారంలో నాలుగు రోజులు ప్రగ‌తిభ‌వ‌న్ లో ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి కానున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరును నేరుగా ప్ర‌జ‌ల‌నే అడిగి తెలుసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ఇంకో సంచ‌ల‌నం ఏంటంటే ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వ‌మే నేరుగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు తీసుకెళ్లి ముఖ్య‌మంత్రిని క‌లిపిస్తుంది. త‌రువాత ప్ర‌భుత్వ‌మే తిరిగి ఇంటి వ‌ద్ద దిగ‌బెడుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఖ‌ర్చులు, వ‌స‌తులు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.

ఈ నెల 17,18 తేదీల‌లో శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసిన త‌రువాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసి ప్ర‌జాద‌ర్బార్ వివ‌రాలు చెబుతార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు తెలంగాణ‌లోని అన్ని జిల్లాల‌కు స‌మాచారం ఇవ్వ‌నున్నారు. ఎంపిక చేసిన జిల్లాలు, మండ‌లాల నుండి ప్ర‌జ‌ల‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు తీసుకువ‌స్తారు. విడ‌త‌ల వారీగా వారానికో జిల్లా ఎంపిక చేసి క్ర‌మ‌క్ర‌మంగా అన్ని జిల్లాల ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రిని క‌లిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

NO COMMENTS

Leave a Reply