కేసీఆర్ తాజా వ‌రం…అనూహ్య‌మైన‌ది

kcr-facebook-page

సంక్షేమ పాల‌న‌లో రాష్ట్ర ప‌రిపాల‌నను ముందుకు తీసుకువెళుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రో అనూహ్య వ‌రాన్ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఒంటరి జీవితం గడుపుతున్న స్త్రీలకు జీవనభృతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. శాసనసభ వేదికగా ఈ విషయాన్ని సీఎం ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకల్లాగే మానవీయ కోణంలో మరో పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఈ పథకాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలు పడుతున్న కష్టాలను తీర్చేందుకు ఆర్థిక సహాయం అవసరమని గత కొంతకాలంగా తమ దృష్టికి వస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని, సాధ్యసాధ్యాలను గుర్తించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉన్నట్లు అంచనా. వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వచ్చే మార్చి నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. ఒంటరి స్త్రీలకు రూ. 1000 జీవనభృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలవుతుందని ప్ర‌క‌టించారు.

NO COMMENTS

Leave a Reply