నిరుద్యోగుల‌ను కేసీఆర్ మోసం చేశాడా?

kcr-assembly

నిజం మాట్లాడుకొని, ప‌రిస్థితుల‌కు సిద్ధం అవ‌డా మేలా? లేదంటే దాప‌రికాల‌తో మోసం చేసి స‌మ‌యం వ‌చ్చిన‌పుడు చేతులు ఎత్తేయ‌డం క‌రెక్టా…అంటే కాస్త విశ్లేష‌ణ జ్ఞానం ఉన్న‌వారు ఎవ‌రైనా….నిజం చెప్పి స‌మ‌స్య‌కు త‌గిన ప‌రిష్కారాలు చూప‌డమే స‌రైన‌ద‌ని అంటారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అదే ప‌ని చేశార‌ని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో విద్యా సంబంధ‌మై అంశాల‌పై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ …. చదువుకున్న వారంద రికీ ఉద్యోగాలు సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వంలో మూడు లక్షలకు మించి ఉద్యోగావకాశాలు ఉండవని సీఎం తెలిపారు. అవసరం మేరకు నియామకాలు జరిపినప్పటికీ చదువుకున్న వారందరికీ ఏ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడానికి ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా వెళ్లడం ప్రధానమన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యను అభ్య సించినవారితో పాటుగా వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసిన వారందరికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్‌ వివరించారు. కాలేజీల నుండి బయ టికి వచ్చిన వెంటనే ఉపా ధి పొందే విధంగా సరికొత్త కోర్సులను రూపొందిం చడం జరుగుతుందన్నారు. బీఈడీ, డీఈడీ కళాశాల లను కుదించవలసి ఉందని, ఏటా 42 వేల మంది కి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు. ప్రభు త్వంలో కూడా చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు అసాధ్యం అని పేర్కొన్నారు. చదువుకున్న వారికీ సంబంధిత రంగాల్లో ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొనడం ప్రధానం అని ముఖ్యమంత్రి పేర్కొన్నా రు.

ఇంజనీరింగ్‌ విద్యార్దులు హోంగార్డులు, కాని స్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే పరిస్దితి ఉత్పన్నం కాని విధంగా ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ వివ‌రించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ఉత్ప త్తి, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా ప్రోత్సాహరాలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కంటే కూడా ప్రైవేటు రంగంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని, భవిష్యత్‌లో చదువులకు అనుగుణంగా ఉపాధి పొందే అవకాశాలు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.

NO COMMENTS

Leave a Reply