కాంగ్రెస్ పాపాలు పోవాలంటే

kavitha mp
కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు పోవాలంటే ఆ పార్టీ నేత, సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ పుష్కరస్నానం చేయాలని, కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరిగాయని, రైతుల ఆత్మహత్యల పట్ల రాహుల్ గాందీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె రాహుల్ పర్యటనను విమర్శించారు.

తెలంగాణ ఏర్పాటై ఏడాది మాత్రమే అయినా తొలిసారి వచ్చిన పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నామని కవిత అన్నారు. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని అన్నారు.

NO COMMENTS

Leave a Reply