జియోలో ఇంకో 30 వేల కోట్లు !

jio2

ఇప్ప‌టికే జియోపై రూ.ల‌క్షా 70 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టిన అంబానీ.. మ‌రో రూ.30 వేల కోట్లు స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హ‌క్కుల‌ను క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా ఈ నిధులు స‌మ‌కూర్చుకోవాల‌ని భావిస్తున్న రిల‌యెన్స్‌.. వాటిని జియో నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యం పెంపు కోసం ఉప‌యోగించ‌నుంది. మార్చి 31 వ‌ర‌కు త‌మ యూజ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్, డేటా అందిస్తున్న జియో.. రోజుకు కొత్త‌గా 6 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్న‌ట్లు చెప్పింది. త‌మ సేవ‌ల‌ను ప్రారంభించి 4 నెల‌లు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు జియో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 7.24 కోట్ల‌కు చేర‌డం విశేషం.

అన్నీ ఫ్రీ అంటూ జియో ఇస్తున్న ఆఫ‌ర్ల‌ను భార‌తీ ఎయిర్‌టెల్ ట్రిబ్యున‌ల్‌లో స‌వాలు చేసింది. దీనిపై ఫిబ్ర‌వ‌రి 1న విచార‌ణ కూడా జ‌ర‌గ‌నుంది. ప్ర‌త్య‌ర్థి కంపెనీలు అడ్డంకులు సృష్టిస్తున్నా.. జియో మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. అంద‌రిలో ఒక‌టిగా ఉండాల‌ని జియో అనుకోవ‌డం లేదు. అత్య‌ధిక లాభాలు అందిస్తున్న పెట్రోలియం ఉత్ప‌త్తుల నుంచి మెల్ల‌గా టెలికాం రంగంలోనూ ఆ స్థాయి లాభాల కోసం జియోలో భారీగా పెట్టుబ‌డుల‌కు అంబానీ ఆస‌క్తి చూపిస్తున్నారు.

NO COMMENTS

Leave a Reply