జ‌గ‌న్ కు వాళ్ల అయ్య బుద్దులు రాలేదు

jc

జగన్ కు వాళ్ల నాయిన‌ బుద్ధులు రాలేదు. తాత బుద్ధులు వచ్చాయి. రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, కాలు నరకడం తెలుసు. అలాంటి బుద్ది ఉన్న వాడినే జ‌గ‌న్ ఇప్పుడు తాడిప‌త్రి ఇంఛార్జిగా పెట్టాడ‌ని టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి విమ‌ర్శించాడు. కడపజిల్లా పైడిపాలెం ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రారంభం అనంత‌రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడాడు.

నోటికొచ్చినట్టు మాట్లాడితే తన నాలుక కోస్తానని చెప్పిన రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై జేసీ విరుచుకుప‌డ్డాడు. ఎవడో చెప్పిన మాటలు విని, నన్నే కామెంట్ చేస్తావా? న‌న్ను జానీవాక‌ర్ రెడ్డి అంటావా .. మ‌ద్యం తాగ‌డం మా ఇంటా వంటా లేదు. “ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు” అంటూ నిప్పులు చెరిగాడు.

NO COMMENTS

Leave a Reply