అమ్మ మ‌ర‌ణం గుట్టు విప్పుతా

panneerselvam1

నేను మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోకి వ‌స్తాను. ద‌మ్ముంటే శ‌శిక‌ళ అసెంబ్లీలో బ‌లం నిరూపించుకోవాలి. నాకు మ‌ద్ద‌తు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. శ‌శిక‌ళ‌కు జ‌నం మ‌ద్ద‌తు లేదు. నేను తిరిగి ముఖ్య‌మంత్రి అవుతా .. ఆ త‌రువాత నా తొలి సంత‌కం అమ్మ మ‌ర‌ణం వెన‌క ర‌హ‌స్యాలు తెలియాల‌నే ఫైలు మీద‌నే సంత‌కం పెడ‌తా అని త‌మిళ‌నాడు ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం అన్నారు.

త‌నతో పాటు 7 కోట్ల మంది తమిళ ప్రజలకు అమ్మ మరణంపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందేనని పన్నీర్ సెల్వం అన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన శశికళ వర్గంపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఆసుపత్రిలో అమ్మ వద్దకు తనను కూడా అనుమతించలేదని, అసలు ఏ కారణంతో అమ్మ మరణించారు? అంత రహస్యంగా ఎలాంటి వైద్యం ఆమెకు అందించారు? మరణానికి అసలు కారణాలేంటి? తదితర విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని పన్నీర్ సెల్వం అన్నారు. తన ప్రాణాలు అర్పించి అయినా, పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకుంటానని, అమ్మ ప్రారంభించిన ప్రజారంజక పాలన రాష్ట్రంలో కొనసాగి తీరుతుందని అన్నారు.

NO COMMENTS

Leave a Reply