స‌ప్త స‌ముద్రాలు దాటి …!

abn

తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో తెలంగాణ నుండి జేఏసీ స‌హా అనేక సంఘాల నేత‌లు ఢిల్లీకి వెళ్లి అప్ప‌టి కేంద్ర‌మంత్రి జైపాల్ రెడ్డిని క‌లిసి తెలంగాణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, తెలంగాణ ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాల‌ని కోరిన విష‌యం తెలిసిందే. విద్యార్థుల బ‌లిదానాలు చూస‌యినా ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ప్ర‌జ‌ల నుండి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ‌చ్చింది. కానీ తాను జాతీయ‌వాదినంటూ అంద‌రి విన‌తుల‌నూ ప‌క్క‌కు తోసేశారు.

అయితె అప్ప‌ట్లో త‌న పాత్ర గురించి నోరు మెద‌ప‌ని జైపాల్ రెడ్డి ఇప్పుడు ఏ వేదిక మీదికి ఎక్కినా తెలంగాణ తెచ్చింది నేనే అంటూ భుజాలు చ‌రుస్తున్నాడు. కేసీఆర్ పాత్ర ఏం లేద‌ని, అంతా త‌న‌దే అంటూ గ‌ప్పాలు కొడుతున్నాడు. తాజాగా ఆయ‌న ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌తో ఓ డిబేట్ పెట్టించుకోవ‌డం .. దాన్లో త‌న పాత్ర‌కు సంబంధించి మాజీ ఎంపీలు పొన్నం ప్ర‌భాక‌ర్, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ల‌తో సాక్ష్యాలు చెప్పించుకోవ‌డం .. కోదండ‌రాంని కూడా వంత పాడించుకోవ‌డం గ‌మ‌నార్హం. స‌ప్త స‌ముద్రాలు దాటి మురికి కాలువ‌లో ప‌డ్డ‌ట్లు జాతీయ‌వాది అయిన జైపాల్ రెడ్డి రాధాకృష్ణ ముందు త‌న తెలివి గురించి చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం ..

పార్ల‌మెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు వివ‌రాలు జైపాల్ రెడ్డి మాట‌ల్లో ఆంధ్ర‌జ్యోతి రాత‌ల్లో ..

‘‘బీజేపీ పక్ష నేత సుష్మా స్వరాజ్‌, స్పీకర్‌ మీరాకుమార్‌ సహకరించడం లేదని కమల్‌నాథ్‌ చెప్పారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సుష్మ మోసం చేస్తారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు న్యాయంగా ఆలోచించడం లేదని, బిల్లును పాస్‌ చేయకుండా బీజేపీని అపకీర్తి పాలు చేయాలని చూస్తున్నాడని సుష్మ చెప్పారు.
ఒకరిపై మరొకరు పరస్పర అపనమ్మకంతో ఉన్నారు. సభ సజావుగా సాగనప్పుడు ఓటింగ్‌ ఎలా నిర్వహిస్తామని స్పీకర్‌ మీరాకుమార్‌ సందేహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో నేను రంగంలోకి దిగాను. స్పీకర్‌ చాంబర్లో మీరాకుమార్‌, సుష్మ, కమల్‌నాథ్‌లతో మాట్లాడాను. సుష్మ, కమల్‌నాథ్‌ మధ్య అపనమ్మకం తొలగించాను. 367-3 నిబంధన ప్రకారం డివిజన్‌ లేకుండా హెడ్‌ కౌంట్‌తో బిల్లును ఆమోదించవచ్చని చెప్పాను. స్పీకర్‌ తన సిబ్బంది ద్వారా రికార్డులను పరిశీలించుకుని నిజమని తేల్చుకున్నారు. సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత హెడ్‌ కౌంట్‌ చేపట్టారు. ఆ సమయంలో సుష్మతోపాటు ఆడ్వాణీ కూడా లేచి నుంచున్నారు’’ అని వివరించారు. తనకున్న విశ్వసనీయతతోనే ఆరోజు సుష్మ, కమల్‌నాథ్‌, మీరాకుమార్‌లను ఒప్పించానని తెలిపారు. స్పీకర్‌ చాంబర్లో జరిగిన విషయాలను బయటకు చెప్పడం సంప్రదాయం కాదనే ఇప్పటి వరకూ తాను బయట పెట్టలేదని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ సోనియా గాంధీకే రావాలని, దానిని పదిమంది పంచుకోరాదనే ఇప్పటి వరకూ తన కృషిని చెప్పలేదని తెలిపారు. ప్రచారం కోసం పాకులాడే మనస్తత్వం తనది కాదని, అందుకే తెలంగాణ సాకారం కావడానికి తాను చేసిన కృషిని చెప్పలేదన్నారు. ఆరోజు స్పీకర్‌ చాంబర్లో జరిగిన చర్చ కానీ, బిల్లు ప్రవేశ పెడుతున్న విషయం కానీ కేసీఆర్‌కు తెలియదని చెప్పారు.

ఉద్యమంలో ఆయనకు అద్వితీయ పాత్ర ఉన్నా.. పార్లమెంటులో బిల్లు ఆమోదంలో ఆయనకు ఎటువంటి పాత్ర లేదని, ఏం జరుగుతోందో ఆయనకు తెలియదని చెప్పారు. అయితే, బిల్లును ఆమోదించడానికి కావాల్సిన సభ్యుల సంఖ్య ఆరోజు లేదని, సింపుల్‌ మెజారిటీతోనే బిల్లును ఆమోదించడానికి బలం లేదని, అందుకే 367-3 ద్వారా హెడ్‌ కౌంట్‌ కూడా జరపకుండా బిల్లు ఆమోదం పొందినట్లు చెప్పారని ఉండవల్లి ఆరోపించారు. అసలు ఆరోజు బిల్లు పాసవ్వలేదని, అందుకు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. బిల్లును ఆమోదించే సమయంలో లోక్‌సభలో హెడ్‌కౌంట్‌ చేశారని, అందుకు తాను ప్రత్యక్ష సాక్షినని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. సోనియా పట్టుదల, సుష్మ హామీ, తెలంగాణ ఎంపీల చొరవతో మొత్తంమీద బిల్లు పాసయిందని, ఆరోజు అలా చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం వ్యాఖ్యానించారు.

NO COMMENTS

Leave a Reply