జై జ‌వాన్ : ప్ర‌త్యేక‌త చాటుకున్న కేసీఆర్

KCR2

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో సారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. దేశంకోసం స‌ర్వం త్య‌జించి, ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి త‌మ జీవితాల‌ను అంకితం చేస్తున్న సైనికుల‌కు అండ‌గా నిలిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుంటుంద‌ని, ఈ మేర‌కు మాజీ సైనికుల‌కు, విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సైన్యంలో అత్యున్న‌త అవార్డులు అందుకున్న వారికి తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలోని మిగిలిన రాష్ట్రాల క‌న్నా ఉన్న‌తంగా గౌర‌విస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం సైనికుల‌కు అండ‌గా నిల‌వ‌డం మాత్ర‌మే కాకుండా ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రతి ఏడాది రూ. 25 వేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రూ. 10 వేలు సైనికుల సంక్షేమ నిధికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సైనిక సంక్షేమ నిధికి ఇచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. సైనికుల సంక్షేమ నిధికి డబ్బులు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

– మాజీ సైనికులు చనిపోతే అతని భార్యకు కూడా రెండు పెన్షన్స్ పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

– అవార్డుల కింద ఇచ్చే నగదు భారీగా పెంపు. పంజాబ్ కంటే ఎక్కువ ఇవ్వాలని నిర్ణయం

– పరమవీర చక్ర, అశోక్ చక్ర అవార్డ్ పొందిన తెలంగాణ సైనికులకు రూ.2 కోట్ల 20 లక్షలు

– మహావీర చక్ర, కీర్తి చక్రకు రూ.కోటి 20 లక్షలు

– వీరచక్ర, శౌర్య చక్ర సాధించే తెలంగాణ బిడ్డకు రూ. 75లక్షలు

– సేవ మెడల్ సాధించిన సైనికులకు రూ.30లక్షలు

– సర్వోత్తమ్ యుద్ధ అవార్డ్ సాధించిన తెలంగాణ బిడ్డకు రూ. 25లక్షలు

– ఉత్తమ యుద్ధ సేవా మెడల్ కు రూ.25లక్షలు

– యుద్ధ సేవ మెడల్ కు రూ.5 లక్షలు

– సర్వీస్ లో ఉండి చనిపోతే సైనికులకు ఎలాంటి పరిహారం అయితే వస్తోందో.. అదే తరహాలో అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా వర్తింపు

– గురుకుల విద్యా సంస్థల్లో సైనికుల పిల్లలకు రిజర్వేషన్లు

– వరంగల్ లో సైనిక స్కూల్ ఏర్పాటు. త్వరలో కేంద్రంతో ఒప్పందం

– సర్వీస్ లో ఉండి చనిపోతే సైనికులకు ఎలాంటి పరిహారం అయితే వస్తోందో.. అదే తరహాలో అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా వర్తింపు

– గురుకుల విద్యా సంస్థల్లో సైనికుల పిల్లలకు రిజర్వేషన్లు

– వరంగల్ లో సైనిక స్కూల్ ఏర్పాటు. త్వరలో కేంద్రంతో ఒప్పందం

– సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు

– డబుల్ బెడ్ రూం స్కీంలో సైనికులకు 2శాతం కేటాయింపు

– ప్రతి జిల్లాలో సైనిక సంక్షేమ బోర్డ్ ఏర్పాటు

– రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు

NO COMMENTS

Leave a Reply