ఆంధ్రామీడియా ప‌రువు తీసిన ఐటీ కంపెనీలు

tv9 - abn andhrajyothy

ఇపుడు హైద‌రాబాద్‌లో ఏం జ‌రుగుతోంది? న‌గ‌రం మొత్తం మునిగిపోయి ప్ర‌పంచం అంతా వ‌చ్చే ప్ర‌ళయం ఒక్క హైద‌రాబాద్‌లోనే వచ్చేసింది. అవునా? అదెలా అంటారా? అయ్యో..మీరు ఆంధ్రామీడియా చాన‌ల్లు చూడ‌ట్లేదా? ఆ చానెల్ల‌లో ఇదే వ‌స్తోంది క‌దా. పైగా హైద‌రాబాద్ కీర్తిని పెంచుతున్న ఐటీ కంపెనీలు కూడా అల్ల‌క‌ల్లోలం అయిపోతున్నాయి చెప్తున్నారు కూడా. కానీ అదేమీ లేద‌ని ఐటీ కంపెనీల ప్ర‌తినిధులు తేల్చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్సీఎస్సీ), హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అసోసియేషన్‌(హైసియా), నాస్కామ్‌, ఐటీఈ అండ్‌ సీ శాఖ ప్రతినిధులు, సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ విష‌యం స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ ఐటీ ఉత్పత్తులకు ఎలాంటి ఢోకా లేదని ఆయా సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. న‌గ‌రంలోని ప‌రిస్థితుల‌పై ఈ సంస్థ‌ల ప్ర‌తినిధులు సమీక్ష నిర్వహించారు. వరద ముంపు నేపథ్యం ఐటీ ఉత్పత్తులపై ప్రభావం చూపడం లేదని ప్రతినిధులు స్పష్టం చేశారు. నగరంలో వర్షం ప్రభావం ఉన్నప్పటికీ ఐటీ ఉద్యోగుల హాజరు సాధారణంగానే ఉందనీ, 90-95శాతం వరకు ఉద్యోగులు హాజరవుతున్నారని చెప్పారు. ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా సేవలకు అంతరాయం కలగడం లేదన్నారు. ఉద్యోగుల అవసరాల మేరకు సమయాల్లో మార్పు చేయడంతోపాటు అవసరమైతే ఇళ్ల నుంచే సేవలిందించేలా ఆయా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కొన్ని సంస్థలు ఉద్యోగుల కోసం ఆహారం, ఇంధనం నిల్వ ఉంచాయని పేర్కొన్నారు. ఐటీ ఉత్పత్తులకు విఘాతం కలుగుతోందనే వదంతుల్ని నమ్మవద్దని కోరారు. ఎస్సీఎస్సీ, నాస్కమ్‌, హైసియా సంస్థల వెబ్‌సైట్లలో తరచూ సమాచారాన్ని పొందుపరుస్తామని, ఉద్యోగులు వాటినే అనుసరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణకు సివిల్‌ పోలీసుల్నీ వినియోగిస్తున్నట్లు సైబారాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా తెలిపారు. ఐటీ కారిడార్‌లో రహదారుల మరమ్మతులకు తక్షణచర్యలు చేపట్టాలని ఎస్సీఎస్సీ కార్యదర్శి భరణి అరోల్‌ ప్రభుత్వాన్ని కోరారు.

NO COMMENTS

Leave a Reply