హైపర్ రివ్యూ.. ఫ‌స్ట్ టాక్‌..!

hyper-review-and-rating

నటీనటులు- రామ్, రాశీఖన్నా, సత్య రాజ్, నరేష్ ,తులసి, రావు రమేష్, షిండే తదితరులు
దర్శకత్వం- సంతోష్ శ్రీనివాస్
మాటలు, డైలాగ్స్: అబ్బూరి రవి
సంగీతం-గిభ్రాన్
నేపధ్య సంగీతం : మణిశర్మ
నిర్మాతలు- 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆచంట రాము, ఆచంట గోపీనాద్, అనిల్ సుంకర
సినిమాటోగ్రఫీ : సమీర్‌రెడ్డి
కూర్పు : గౌతంరాజు

రామ్ నేను శైలజ లాంటి హిట్ సినిమా తరవాత కందిరీగ లాంటి బంపర్ హిట్ సినిమా ని రామ్ కి ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో కలిసి చేసిన ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) హీరో రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యింది. యు.ఎస్‌లో 92 థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్ అలాంటిది. ఈ సినిమా హిట్ అయితే రామ్ ఒకే సంవత్సరం లో రెండు హిట్లు కొడతాడు. మరి దర్శకుడు ఈ సినిమా ఎలా తీసాడు, ఆడియన్స్ ని తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఎలా మెప్పించాడో చూద్దాం.

కథ…
సినిమా మొదలు నారాయణ మూర్తి {సత్యరాజ్}, తులసి లకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు నామకరణం చేసేటప్పుడు పూజారి ఈ బిడ్డ తండ్రిని చాలా ప్రేమిస్తాడని జాతకం చెబుతాడు. అయితే ఆప్రేమ సత్యరాజ్ కు వింతగా, హింసగా ఉంటుంది. ఆసుపత్రిలో నర్సుల నుంచి స్కూల్ లో మాస్టర్ వరకు అందరికి ఆ కుర్రాడికి తండ్రి పై ఉన్న ప్రేమని, చాలా ఎంటర్టెన్ గా చూపిస్తారు. ఆ కుర్రాడు పెద్దవాడై హీరో రామ్ [సూరిగాడు] అవుతాడు. గుడిలో ఒక అమ్మాయిని సత్యరాజ్ చూసి, ఈ అమ్మాయి ఏ ఇంటి కోడలు అవుతుందో అనుకుంటాడు. తండ్రికి నచ్చిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు రామ్. ఇంతలో రామ్ కు రాశిఖన్నా తో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం లో రాశి ఖన్న రామ్ ని ప్రేమిస్తుంది. కాని రామ్ రాశిఖన్నాని ప్రేమించడు. వన్ సైడ్ లవ్ అయినప్పటికీ, వీరిద్దరి మద్య కెమిస్ట్రీ భాగుంది. ఇంతలో సత్యరాజ్ కు యాక్సిడెంట్ అవుతుంది. తన తండ్రిని కాపాడిన ఒక రౌడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు రామ్. అయితే ఇంటర్ వెల్ ముందు రామ్ కి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదే ఇంటర్వెల్ బ్యాంగ్.

ఇంటర్ వెల్ తరవాత తన చెల్లెలిని ప్రేమించిన ఫ్యామిలీని, అబ్బాయి ఫాదర్ సుమన్ ని ఒప్పించి పెళ్లి కుదురుస్తాడు హీరో. కాని తరవాత హీరో వల్లనే ఆ పెళ్లి చెడిపోతుంది. దానితో తండ్రి కొడుకిని బయటకి పొమ్మంటాడు. తన తండ్రి చిక్కుకున్న ఒక పెద్ద సమస్యలో తను లీనమై, తన తండ్రిని, కుటుంబాన్ని రావు రమేష్ లాంటి విలన్ నుంచి రక్షించుకుంటాడు. అయితే సత్యరాజ్ కు వచ్చిన సమస్య ఏమిటి? అసలు రామ్ మొదట ఆ రౌడీకి తన తండ్రిని చంపడానికి ఐడియా ఎందుకు ఇచ్చాడు? రామ్ రాశీ ఖన్నాని ఎందుకు ప్రేమించడు? ఎవరిని ప్రేమిస్తాడు? ఎందుకు ప్రేమిస్తాడు? సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది అదేమిటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక సినిమా ఎలా ఉందంటే…

తండ్రీ కోదుకుల కాన్సెప్ట్ పాతదే అయినా, ఆ ప్రేమని చాలా కొత్తగా చిత్రీకరించాడు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఇంటర్ వెల్ ముందు రావు రమేష్  మరియు సత్యరాజ్ మద్య, షిండి సత్యరాజ్ ల మద్య జరిగే రెండు సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రీకరించాడు సంతోష్. మాటలు గాని, వాళ్ళ యాక్షన్ లో గాని ఆర్టిస్ట్లు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక ఇంటర్ వెల్ బ్యాంగ్ లో రామ్ యాక్షన్ గాని, ఆ సిట్యువేషన్ లో రామ్ సెంటిమెంట్ ని గాని, కోపాన్ని గాని, ఒక లాజిక్ అర్ధం చేసుకునే విధానాన్ని కలబోసి అద్భుతంగా నటించాడు రామ్. ఇక ఇంటర్వెల్ తరవాత తండ్రీ కొడుకుల మద్య సెంటిమెంట్ సీన్ ఆడియన్స్ కళ్ళల్లోంచి నీళ్ళు రప్పించింది. సుమన్ మరియు రామ్ మద్యన ఒక సన్నివేశం కూడా చాలా చక్కగా కుదిరింది. రావు రమేష్ తనలో ఎంత నటనా ప్రతిభ ఉందొ అది మొత్తం చూపించారు. ఈ సినిమాలో కే. విస్వనాద్ గారికి ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చరు. ఆ పాత్ర ఎంటర్ అయ్యిన తరవాత సినిమా మంచి హైప్ కి వెళ్తుంది. విశ్వనాధ్ ఉన్న కొద్ది సేపటిలో, కొన్ని సెంటిమెంట్ మరియు మంచి మెసేజ్ ఇచ్చే డైలాగ్స్ సినిమాకి ప్రాణం పోశాయి. ఇక క్లైమేక్స్ లో రామ్ నటన గాని, అనుకున్నది సాధించడానికి ప్రదర్శించిన తెలివితేటలు గాని, డైలాగ్స్ , ఫైట్స్ అన్ని ఆదరిపోయేలా చేసిన రామ్, చేయించిన సంతోష్ శ్రీనివాస్ ఇద్దరు సక్సెస్ అయ్యారు. అయితే సెకండ్ ఆఫ్ కొంత ఫాస్ట్ గా అయిపోయినట్టు, సినిమా అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా మంచి అవుట్ పుట్ ఇచ్చింది. రామ్ సంతోష్ శ్రీనివాస్ ల పెయిర్ లక్కీ పెయిర్ అని మళ్ళీ నిరూపించారు.

ప్రతీ ఇంట్లో ఒకడుంటాడు కాదు ప్రతీ ఇంట్లో ఇలాంటోడు ఒకడు ఉండాలి అన్నట్టు సినిమాని చిత్రీకరించాడు సంతోష్ శ్రీనివాస్

రేటింగ్ – 3.75/5

NO COMMENTS

Leave a Reply