జానారెడ్డి గుండెల్లో దిగిన హ‌రీశ్ రావు సెటైర్‌

harish-rao-farmer

మంత్రి హ‌రీశ్ రావు స‌రదాగా చేసిన కామెంట్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి గుండెల్లో దిగింద‌ని అంటున్నారు. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ధర్మపురిలో జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానించేందుకు దేవాలయ పూజారులు వచ్చారు. ఈ పూజారులంతా మంత్రి హరీశ్‌రావు చాంబర్ వద్ద ఆగారు. అప్పుడే సీఎల్‌పీ కార్యాలయం నుంచి వస్తున్న జానారెడ్డికి అక్కడే ఉన్న పూజారులు, మంత్రి హరీశ్‌రావు ఎదురుపడ్డారు.

జానారెడ్డిని ఉద్దేశించి పూజారులు మీ వద్దకే వస్తున్నారని హ‌రీశ్ రావు అన్నారు. దీనికి జానా మంత్రి హరీశ్‌రావు వైపు ప్రశ్నార్థకంగా చూడగా… మీరు ఎల్లప్పుడూ ప్రతిపక్షనేతగా ఉండాలని ఆశీర్వదించడానికి వస్తున్నారన్నారు. ఒక్క‌సారిగా అవాక్కైన జానారెడ్డి అనంత‌రం త‌మాయించుకొని ….ఎవరు ఎక్కడ ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. అక్కడే ధర్మపురి ఆలయ కమిటీ సభ్యులు,పూజారులు ప్రతిపక్ష నేత జానారెడ్డికి శాలువా కప్పి సత్కరించి, ప్రసాదాన్ని అందించారు.

NO COMMENTS

Leave a Reply