గిన్నీస్ ఈత ప్రాణాలు తీసింది

lanke

కాళ్ల‌కు గోనే సంచులు క‌ట్టుకుని ఈత కొట్టి గిన్నీస్ బుక్ రికార్డుల‌కు ఎక్కాల‌ని భావించిన ఓ కానిస్టేబుల్ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌యింది. విజయవాడ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లంక ఉమామహేశ్వరరావు ఈ రోజు కృష్ణా న‌దిలో ఈత ప్రాక్టీస్ చేస్తూ గుండెపోటు రావ‌డంతో మ‌ర‌ణించారు. ఈత‌గాళ్లు ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించినా ప్రాణాలు నిల‌వ‌లేదు.

గ‌తంలో లిమ్కా బుక్, ఇండియా బుక్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ల‌లో చోటు సంపాదించ‌కున్న ఆయ‌న ఈ నెల 27న గిన్నీస్ రికార్డు బుక్ కోసం ఈత కొట్టాల‌ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయ‌న స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా భ‌ట్టిప్రోలు మండ‌లం ఓలేరు స్వ‌గ్రామం.

NO COMMENTS

Leave a Reply