ఏపీలోని మ‌న ఆస్తులు అమ్మేస్తున్నారు

telangana

ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఉండి స‌రైన ర‌క్ష‌ణ లేని మ‌న ఆస్తుల‌ను అమ్మివేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. భద్రాచలం ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఉన్న 1048 ఎకరాలను వేలం పాటల ద్వారా విక్రయించి ఆ డబ్బులను ఆలయ అభివృద్ధికి ఖర్చు పెట్ట‌నున్నారు. భద్రాచలం ఆలయానికి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం వల్ల ఆలయాభివృద్ధికి చేపట్టిన పనులు ఆగిపోయాయయి. భద్రాచలం ఆలయం మినహా చుట్టు పక్కలున్న ఏడు మండలాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లడంతో గతంలో థీమ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నారు. దీంతో ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషిస్తున్నారు.

కాగా త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌తో ఏపీలో ఉన్న భూములు, ఇత‌ర‌త్రా స‌మాచారం సేక‌రించి వాటిని అమ్మ‌కానికి పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. త‌ద్వార ఇటు ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌, అటు ఆల‌య అభివృద్ధి జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్తున్నారు.

NO COMMENTS

Leave a Reply