కేసీఆర్‌లో ఇంకో కోణం చెప్పిన గ‌వ‌ర్న‌ర్‌

kcr-governor

 

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గురించి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ మ‌రో కొత్త కోణంలో విశ్లేషించారు. కేసీఆర్ లాంటి సీఎంను తాను ఎక్క‌డా చూడ‌లేద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. మసోమా జ్యోతిర్గమయ అన్నట్లు చీకటి నుంచి వెలుగులోకి నడిపిన నాయకుడిగా కేసీఆర్ నిలిచారు అని గవర్నర్ ప్రశంసించారు. కేసీఆర్ చీకటి అనే పదానికే కొత్త నిర్వచనమిచ్చారని అన్నారు. . ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో. గవర్నర్‌ను కలిసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ చీకటి నుంచి వెలుగులకు నడిపించిన నాయకుడు అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బ్రహ్మాండంగా ఉన్నాయని కొనియాడారు. అవినీతిరహిత సమాజ నిర్మాణంవైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తున్నదని కొత్త సంవత్సరం వేడుకల్లో గవర్నర్ చెప్పారు. 2017 తెలంగాణకు కార్యసాధక సంవత్సరమని అభివర్ణించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌లో తాను గమనించిన ఉన్నతమైన లక్షణాల గురించి గ‌వ‌ర్న‌ర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎలాంటి భేషజాలకు పోకుండా ఇతరుల సలహాలను కూడా సీఎం పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఇటువంటి సీఎం గురించి తానెక్కడా వినలేదని చెప్పారు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత పరిణామాలెలా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు తప్ప వెనుకడుగు వేయరు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రం అంధకారాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. కానీ తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లు చీకటి నుంచి వెలుగులోకి నడిపిన నాయకుడిగా కేసీఆర్ నిలిచారు అని గవర్నర్ ప్రశంసించారు. కేసీఆర్ చీకటి అనే పదానికే కొత్త నిర్వచనమిచ్చారని అన్నారు. విద్యుత్‌రంగంలో అనూహ్యమైన రీతిలో సాధించిన ప్రగతి మహాద్భుత ఘట్టంగా ఆయన అభివర్ణించారు. డైనమిక్ లీడర్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. 2017 తెలంగాణకు కార్యసాధక సంవత్సరంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడి 31 నెలలు గడిచిన క్రమంలో తెలంగాణ రాష్ట్రం నిర్దిష్టమైన లక్ష్యంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళుతున్నదని చెప్పారు. పక్కా ప్రణాళికతో వివిధ పథకాల అమలు తీరు భేష్ అని ప్రశంసించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంసించారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన మిషన్ భగీరథ గురించి చెప్తూ.. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ టు ఫెచ్ ఎ పేల్ ఆఫ్ వాటర్ అన్న ఇంగ్లిష్ కవితను గ‌వ‌ర్న‌ర్‌ ప్రస్తావించారు. బకెట్ నీళ్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రతీ పౌరునికీ నీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ బృహత్తర కార్యక్రమమని అభివర్ణించారు. మిషన్ కాకతీయ రెండు దశల పనులు పూర్తయిన క్రమంలో తెలంగాణ త్వరలో మంచి ఫలాలను అందుకోబోతున్నదన్నారు. మిషన్ కాకతీయకు వరుణుడి కరుణకూడా తోడుకావడంతో సాగుకు చాలినంత నీరు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. సమాచార, సాంకేతిక రంగంలో తెలంగాణ సృజనాత్మకమైన ఆలోచనలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని గవర్నర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త కొత్త విధానాలతో మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేకంగా మంత్రి కేటీ రామారావును ప్రశంసించారు. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైనదని, కానీ ప్రభుత్వ కృషివల్ల అది సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నదని అన్నారు.

NO COMMENTS

Leave a Reply