శాత‌క‌ర్ణికి రాయితీపై హైకోర్టుకు ..

ఆంధ్రా టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌ముఖ న‌టుడు బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు ఆంధ్రా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం వినోద‌పు ప‌న్నును మిన‌హాయించ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఓ న్యాయ‌వాది లంచ్ మోష‌న్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

చంద్ర‌బాబుకు బాల‌కృష్ణ బావ‌మ‌రిది కాబ‌ట్టే ఈ మిన‌హాయింపు ఇచ్చార‌ని హైకోర్టులో దాఖ‌లు చేసిన‌ పిటీష‌న్ లో పేర్కొన్నారు. అయితే నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే నిర్మాత నుండి డ‌బ్బులు వ‌సూలు చేయొచ్చ‌ని, దీనిపై రెగ్యుల‌ర్ బెంచ్ కు వెళ్లాల‌ని కోర్టు పిటీష‌న‌ర్ ను ఆదేశించింది.

NO COMMENTS

Leave a Reply