గద్దర్ ను లాగుతున్న తమ్మినేని

gaddar

వరంగల్ ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఎట్టి పరిస్థితులలోనయినా ప్రజా గాయకుడు గద్దర్ ఆలియాస్ గుమ్మడి విఠల్ రావును బరిలోకి దింపేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి గద్దర్ సుముఖంగానే ఉన్నారని, ఆయన పోటీకి దిగితే అభ్యర్థిని నిలబెట్టకుండా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు తమకు హామీ ఇచ్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అస్థవ్యస్థంగా సాగుతుందని, ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బకొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తమ్మినేని అన్నారు. మరి ప్రజలు అసంతృప్తితో ఉంటే ..పాలన అస్తవ్యస్తంగా ఉంటే ఇన్ని పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నాలు చేయడం ఎందుకు ? ఏ పార్టీ తరపున కూడా ఇంతవరకు పోటీ చేస్తానని ఎవరూ ముందుకు రానిది ఎందుకో తమ్మినేని చెబితే బాగుండు.

NO COMMENTS

Leave a Reply