నీట్లో తేలిన‌ట్లుందే ..

hs

ఇప్పటిదాకా ప్ర‌ధాన చౌర‌స్తాల‌లో .. భ‌వ‌నాల మీద ద‌ర్శ‌నం ఇచ్చిన హోర్ఢింగులు ఇక నీటి మీద ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాయి. గాలివాన‌కు ఎక్క‌డ కూలి మీద ప‌డ‌తాయో అని ఇన్నాళ్లు భ‌యం ఉండేది .. ఇప్పుడు వాటిని ఇక నీళ్ల మీద చూడ‌వ‌చ్చు. ప్ర‌పంచంలోనే ఒక‌టి, రెండు చోట్ల అమ‌ల‌వుతున్న ఫ్లోటింగ్ బిల్ బోర్డుల విధానాన్ని దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిచయం చేస్తున్నది.

చిన్న తెప్ప మీద తెరచాపలాంటి హోర్డింగుల్ని పర్యాటకులను ఆకర్షించేలా జలాశయాల్లో ఏర్పాటుచేస్తారు. ఇవి పర్యావరణ అనుకూలంగా సౌరశక్తితో పని చేస్తాయి. ఈ ప్రయోగానికి అధికారులు టెండర్లు పిలువగా ధనుష్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్లోటింగ్ బిల్ బోర్డుల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. 10అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సరూర్‌నగర్‌లో 15, హుస్సేన్‌సాగర్‌లో 15 బోర్డుల ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌ఈడీ లైటింగ్, సోలార్ లైటింగ్, ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా బ్యాకప్ సౌకర్యం వీటికి ఉంటుంది.

NO COMMENTS

Leave a Reply