సినిమా రివ్యూ: దొంగాట‌

న‌టీన‌టులు: ల‌క్ష్మీ మంచు, అడివి శేష్‌, బ్ర‌హ్మానందం, పృధ్వీ, ప్ర‌గ‌తి త‌దిత‌రులు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం : వ‌ంశీ కృష్ణారెడ్డి
నిర్మాత‌: మ‌ంచు ల‌క్ష్మీ ప్ర‌సన్న‌
రేటింగ్‌: 2/5

సింగిల్ లైన్ :
డ‌బ్బు కోసం అన్ని విలువ‌ల్ని వ‌దులుకునే ఓ దుర్మార్గుడి క‌థ ఇది. హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి 20కోట్లు కొట్టేయాల‌నుకున్న ఓ డ‌బ్బు పిచ్చోడి జీవితంలో చివ‌రికి ఏమైంది? అన్న‌దే క‌థాంశం.
క‌థాక‌మామీషు:
వెంక‌ట్ (అడివి శేష్‌), కాట‌మ్‌రాజు, విజ్జు ముగ్గురు కిడ్నాప్ గ్యాంగ్. ఫేమ‌స్‌ హీరోయిన్ ఝాన్సీ (ల‌క్ష్మి మంచు)ని కిడ్నాప్ చేసి రూ.20కోట్లు కొట్టేయాల‌ని ప‌థ‌కం వేస్తారు. కోట్ల‌లో కొట్టేసి విదేశాలు వెళ్లి హాయిగా జీవించాల‌న్న‌ది వెంక‌ట్ ప్లాన్‌. అందుకోసం మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ఈ ప్లాన్ వేస్తాడు. అనుకున్న‌ట్టే ఓ ప‌బ్బులో స‌దరు హీరోయిన్ ఫుల్ ఖుషీ మోడ్‌లో ఉన్న‌ప్పుడు ముసుగువేసి కిడ్నాప్ చేస్తారు. అందులో విజ్జు బాస్ బ్ర‌హ్మీ (బ్ర‌హ్మానందం) ఆఫీస్ కం ఇంట్లోనే స‌ద‌రు హీరోయిన్‌ని దాచి పెడ‌తారు. విదేశాల్లో ఉండి డిటెక్టివ్ ప‌నులు చేస్తాన‌న్న క‌ల‌రింగ్ ఇచ్చి అదే సిటీలో తిరిగే స‌ద‌రు బ్ర‌హ్మీ అలియాస్ మేన్ ఆఫ్ ఫైర్ హీరోయిన్ మిస్సింగ్ కేసును డీల్ చేయ‌డానికి రంగంలోకి దిగుతాడు. మిస్సింగ్ కేసు గురించి పోలీసుల ద‌ర్యాప్తు మొద‌ల‌వుతుంది. అయితే ఈలోగానే సద‌రు హీరోయిన్ డిటెక్టివ్ బ్ర‌హ్మీ ఇంట్లోనే ఉంద‌న్న సంగ‌తిని తెలుసుకుంటాడు. అయితే అక్క‌డికి ఎలా వ‌చ్చిందో తెలీదు. అస‌లు కిడ్నాప‌ర్ ఎవ‌రో అర్థం గాక బుర్ర పీక్కుంటాడు. ఈలోగానే ఓ ట్విస్టు. అస‌లు వెంక‌ట్ కిడ్నాప్ డ్రామా ఆడుతున్న‌ది అంతా అబ‌ద్ధం. అది హీరోయిన్ ఝాన్సీ మాష్ట‌ర్ ప్లాన్‌. అందుకు వెంక‌ట్ స‌హకారం అందిస్తున్నాడంతే. ఈ ట్విస్టు ఇలా వ‌చ్చింది అన‌గానే మ‌రో ట్విస్టు. అస‌లు వీళ్ల గ్యాంగులో ఉండే కాట‌మ్‌రాజు ఆ రూ.20కోట్లు కొట్టేసి తిరిగి హీరోయిన్ మ‌మ్మీకే ఇవ్వాల‌న్న‌ది ఆ ఇద్ద‌రి ఒప్పందం. అస‌లు ఇదంతా ఎందుకు చేస్తోంది మ‌మ్మీ అంటే, కూతురు ఝాన్సీ ఆ రూ.20కోట్ల‌ను అప్ప‌నంగా ఓ అనాధ‌శ‌ర‌ణాల‌యానికి దానం ఇచ్చేస్తోంది. అది ఇష్టం లేకే ఇలా చేస్తుంది. చివ‌రికి ఆ 20కోట్ల‌ను ఎవ‌రు చేజిక్కించుకున్నారు? కిడ్నాప్ డ్రామా క‌థ ఏ కంచికి చేరింది? అన్న‌దే మిగ‌తా సినిమా.
ప్ల‌స్‌లు:
మ‌ంచు ల‌క్ష్మి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ అదిరిపోయింది. ఓ ఫైటింగ్ సీన్‌లో చార్లెస్ ఏంజిల్‌లా క‌నిపించింది. ద్వితీయార్థంలో కొన్ని ట్విస్టులు, సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. మ‌గాళ్ల‌పై విరుచుకు ప‌డే ల‌క్ష్మీ పాట సూటైంది.
మైన‌స్‌లు:
అస‌లు ఈ క‌థేంటో ఎవ‌రికీ అర్థం కాదు. ఆ కిడ్నాప్ గ్యాంగ్ ఏంటో? వాళ్ల వాల‌కాలేంటో క్లారిటీ ఉండ‌దు. ప్ర‌థ‌మార్థం పెద్ద బోర్‌. న‌స‌. ద్వితీయార్థంలో రివ‌ర్స్ అండ్ ఫార్వార్డ్ స్క్రీన్‌ప్లేలో కొన్ని స‌న్నివేశాల్ని చూపించాల్సిన అవ‌స‌రం ఏంటో కూడా అర్థం కాదు. ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి వెళ్లేప్పుడు కంటిన్యుటీ అర్థం ప‌ర్థం లేకుండా ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టే మ్యూజిక్ టీవీ సీరియ‌ళ్ల నుంచి తెచ్చిన‌ట్టే ఉంటుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాల‌కు పెద్ద‌గా ప‌నేం లేద‌నిపిస్తుంది. అనాధలం అన్న స‌న్నివేశంలో బాధ, సింప‌థీ కంటే కోప‌మే ఎక్కువ వ‌స్తుంది అంద‌రికీ.
న‌టీన‌టులు: ల‌క్ష్మీ పెర్ఫామెన్స్ బావుంటుంది. మునుప‌టి కంటే మెరుగుద‌ల క‌నిపించింది. అడివి శేష్ త‌న పాత్ర ప‌రిధి మేర‌కు ఓకే అనిపించాడు. బ్ర‌హ్మీ కామెడీ రోత‌. అస‌లు కామెడీనే లేదంటే అతిశ‌యోక్తి కాదు. మిగ‌తా వారి గురించి చెప్పుకోవ‌డానికేం లేదు.
ముగింపు:
కిడ్నాప్ గ్యాంగ్‌ల‌కు ఇదో అవ‌మానం. కిడ్నాప్ క‌థ‌ల‌కు చ‌ర‌మ‌గీతం
రేటింగ్‌: 2/5

NO COMMENTS

Leave a Reply