ఇదేం స‌వాల్‌….ఫేస్ బుక్ ఓన‌రుకు తిక్క ఉందా?

face

మార్క్‌ జుకర్‌బర్గ్ ఈ పేరు అంద‌రికీ ప‌రిచ‌యం లేక‌పోయినా…ఆయ‌న సృష్టించిన సోష‌ల్ మీడియా సునామీ ఫేస్ బుక్ అంద‌రికీ సుప‌రిచిత‌మే. అలాంటి ఆవిష్క‌ర్త త‌న‌కు తానుగా స‌వాల్ పెట్టుకున్నారు. ఏటా ఒక కొత్త సవాల్‌ పెట్టుకొని పూర్తిచేయడం అలవాటైన జుక‌ర్ బ‌ర్గ్ 2017 పూర్తయ్యేలోగా అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో కొందరు వ్యక్తుల్ని వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు.

అస‌లు ఎందుకు ఈ ల‌క్ష్యం అనే దానికి వివ‌ర‌ణ ఇస్తూ…..‘ఈ ఏడాది బయటకు వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని నియమం పెట్టుకొన్నా. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాను. ప్రపంచాన్నంతా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి గొంతుకకు ప్రాధాన్యం ఇవ్వడం నా పని. ఈ ఏడాది వారి అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా వింటాను. ఫేస్‌బుక్‌, చాన్‌ జుకర్‌బర్గ్‌ సంస్థలను సమర్థంగా నడిపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచం సరికొత్త యుగంలోకి అడుగిడుతున్న తరుణంలో ఇది సానుకూల ప్రభావం చూపుతుందని’ జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.
గతంలో జుక‌ర్ బ‌ర్గ్ త‌న సొంత ఇంటికి కృతిమ మేథస్సు ఏర్పాటు చేసుకోవడం, మాండరిన్‌ భాష నేర్చుకోవడం, 25 పుస్తకాలు చదవడం, 587 కిలోమీటర్లు పరుగెత్తడం వంటివి పెట్టుకున్నారు. తాజాగా ఈ ల‌క్ష్యం. జుక‌ర్ తాజా ల‌క్ష్యాన్ని చూసిన‌వారంతా..ఆయ‌న‌కు తిక్కుండ‌వ‌చ్చు కానీ దానికో లెక్క ఉంది అంటూ విశ్లేషించారు.

NO COMMENTS

Leave a Reply