డీఎస్ కు పదవొచ్చింది

ds

కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కూడా కల్పించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి నమ్మకంగా ఉన్న డీఎస్ సోనియా కుటుంబం నుండి కొన్నాళ్లుగా ఆదరణ లేకపోవడం, కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం, కొత్తగా పార్టీని నడుపుతున్న నేతలు తనను పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించి పదవి ఇవ్వడం విశేషం.

NO COMMENTS

Leave a Reply