రైతుల కోసం చిరుపాట‌..విమ‌ర్శ‌లు మొద‌లు

chiranjeevi-khaidi-no150

మెగాస్టార్ చిరంజీవిపై మ‌రోమారు వివాదం మొద‌లైంది. చిరంజీవి నూట యాభై సినిమా ఖైదీ నంబర్ 150 త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయ‌న త్వ‌ర‌లో రానున్న సినిమా పాట వివాదంలో ప‌డింది. ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. అన్నదాతల సమస్యల నేపథ్యంలో తెరకెక్కించిన ‘నీరు..నీరు రైతు కంట నీరు’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఖైదీ నంబర్ 150 ఈ నెల 11న విడుదల కానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తోంది.

రైతు రోదిస్తున్నాడు. ఆ ఆవేద‌న ఎవ‌రికీ అర్థంకాదు. పంట కోసం అత‌ను ప్రాణం అర్పిస్తున్నాడు. నీటి చుక్క కోసం నిలువెల్లా త‌పిస్తున్నాడు. పొలం ప‌చ్చ‌గా మారితే, త‌న బ్ర‌తుకు మారుతుంద‌ని ఎదురుచూస్తున్నాడు. హ‌లం ప‌డితే ఆక‌లి తీరుతుంద‌ని ఆరాట‌ప‌డుతున్నాడు. నీటి కోసం రైతు ప‌డే తాప‌త్ర‌యం అంతా ఇంతా కాదు. ఆ భావాన్ని రామ‌జోగ‌య్య ఈ పాట‌లో క‌రుణాత్మ‌కంగా వినిపించారు. రైతే కాదు, ప్ర‌తి గుండెనూ క‌దిలించారు. నీటి చుక్క కోసం కంట నీరు పొంగించారు.

అయితే కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఏనాడు పెద్ద‌గా రైతుల గురించి మాట్లాడ‌ని చిరంజీవి ఇపుడు హ‌ఠాత్తుగా రైతుల ప‌ట్ల ప్రేమ కురిపిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు ఇదంతా సినిమా ప్ర‌చారంలో భాగ‌మ‌ని పేర్కొంటున్నారు. చిరు సినిమా ఇలా విడుద‌ల‌కు ముందే విమ‌ర్శ‌ల పాల‌వ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు హ‌ర్ట్ అవుతున్నారు.

NO COMMENTS

Leave a Reply