చిలుకూరు అర్చ‌కుడి మృతి

chilukuru

చిలుకూరు బాలాజీ ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు శ్రీనివాస రాఘవాచార్యులు (105) సోమవారం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం రాఘవాచార్యులు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మంగళవారం ఉదయం 11 గంటలకు బాలాజీ ఆలయ సమీపంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. శ్రీనివాస రాఘవాచార్యులు కుమారుడు గోపాలకృష్ణ స్వామి ప్రస్తుతం ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.

NO COMMENTS

Leave a Reply