టీటీడీపీలో బాంబు పేల్చిన బాబు !

n-chandrababu-naidu

ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు తెలంగాణ విష‌యంలో చింత‌చ‌చ్చినా పులుపు చావ‌లేదు. ఓటుకునోటు దెబ్బ‌కు తెలంగాణ టెంటు లేపి విజ‌య‌వాడ‌కు ప‌రిమితం అయిన చంద్ర‌బాబు తెలంగాణ‌లోని త‌న పార్టీలో మిగిలిన నేత‌లు మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్ల‌డంలో ఎక్క‌డ వెన‌క్కి త‌గ్గుతారోన‌ని భావించి వారికి ఎప్ప‌టిక‌ప్పుడు తాయిలాలు ఇవ్వ‌డంలో తేడా రానివ్వ‌డం లేదు. ఇప్పుడు కూడా పార్టీ నేత‌లు పార్టీని వీడ‌కుండా మ‌రో హామీ ఇచ్చాడ‌ట చంద్ర‌బాబు.

ఏడాదిన్న‌ర కింద మాజీ మంత్రి, తెలంగాణ టీడీపీ కీల‌క‌నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రాబోతుంద‌ని చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియాతో ప్ర‌చారం చేయించారు. ఆ త‌రువాత అది ఓ పెద్ద జోక్ గా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబుతో తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల‌తో పాటు ప‌లువురు నేత‌లు స‌మావేశానికి వెళ్లారు.

ఈ సంధ‌ర్భంగా వారితో మాట్లాడిన చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో 2019 వర‌కు తెలంగాణ‌లో టీడీపీ తిరుగులేని శ‌క్తిగా మార్చాల‌ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల‌లో వ‌ద‌ల‌న‌ని, తెలంగాణలోని టీడీపీ నేతలకు కేంద్రంలో పదవులు ఇచ్చే విషయమై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో తాను ప్రత్యేకంగా మాట్లాడుతానని అన్నార‌ట‌. పాపం తెలంగాణ టీడీపీ నేత‌ల ప‌రిస్థితి ఒంటె పెద‌వుల‌కు న‌క్క ఆశ‌ప‌డిన‌ట్లు అయింది.

NO COMMENTS

Leave a Reply