బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ అఫ‌ర్లు

bsnl

ఇత‌ర కంపెనీల నుండి వ‌స్తున్న పోటీ నేప‌థ్యంలో బీఎస్ఎన్ఎల్ తాజాగా ఆక‌ర్ష‌నీయ‌మ‌యిన అఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ప్రీపెయిడ్‌ మొబైల్‌ కస్టమర్ల కోసం భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎ్‌సఎన్‌ఎల్‌) ప్రమోషనల్‌ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా కాంబో, డబుల్‌ డేటా వోచర్లను అందిస్తోంది. రూ.13 కాంబో వోచర్‌తో రీచార్జ్‌ చేసుకుంటే 15 రూపాయల ఉచిత టాక్‌టైమ్‌ విలువతోపాటు 10 ఎంబిల డేటా (2 రోజుల వాలిడిటీ) లభిస్తుంది.

రూ.77 వోచర్‌తో రూ.80 విలువైన టాక్‌టైమ్‌, 30 ఎంబిల డేటా (10 రోజుల వాలిడిటీ), రూ.177 వోచర్‌తో రూ.180 విలువైన టాక్‌టైమ్‌, 50 ఎంబిల డేటా (15 రోజుల వాలిడిటీ) లభిస్తుంది. రూ.4,498 డేటా ఎస్‌టివితో 80 జిబి డేటా, రూ.3,998 ఎస్‌టివితో 60 జిబి డేటా, రూ.2,798 ఎస్‌టివితో 36 జిబి డేటా, రూ.1,498 ఎస్‌టివితో 18 జిబి డేటా లభిస్తుంది. వీటి కాలపరిమితి 365 రోజులు.

NO COMMENTS

Leave a Reply