బ్రిటీష్‌ రాణిపై తుపాకి ఎక్కుపెట్టిన పోలీస్‌

police

బ్రిటీష్‌ రాణి రెండవ ఎలిజబెత్‌పై ఓ పోలీస్‌ గార్డు ఏకంగా తుపాకీ ఎక్కుబెట్టాడట. `టైమ్ష్‌’ డైలీ క‌థ‌నం ప్రకారం కొన్నేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. ఒక రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో రాణికి నిద్ర పట్టక ప్యాలెస్‌ ప్రాంతంలో వాకింగ్‌ చేస్తున్నారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఓ గార్డు ఆమెను చూశాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తిగా ఆమెను భావించిన సదరు గార్డు వెంటనే తుపాకీ ఎక్కుపెట్టి, ఎవరు అని అరిచాడట.
అయితే మరుక్షణంలోనే ఆమెను రాణిగా గర్తించి, `యువర్‌ మెజెస్టీ, నేను మీపై కాల్పులు జరపబోయాను’ అని చెప్పా డట. జరిగిన దానికి తనకు కఠిన శిక్ష తప్పదని భావించాడట. అయితే, జరిగిన దానిపై క్వీన్‌ స్పందిస్తూ, `నీవు నన్ను కాల్చనవసరం లేకుండా, ఈసారి వాకింగ్‌కు వచ్చేటప్పుడు నీకు ఫోన్‌ చేసి చెబుతాను` అని సరదాగా అన్నారట. క్వీన్‌ ఎలిజ బెత్‌-2కు నిద్ర సరిగా పట్టకపోతే ప్యాలెస్‌లోని గ్రౌండ్‌‌సలో నడవడం అలవాటట!

NO COMMENTS

Leave a Reply