బీజేపీ ఆఫీసును త‌గ‌ల‌బెట్టేశారు

bjp-office-fire-in-bengal

పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో బీజేపీ కార్యాలయానికి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పంటించారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రోజ్‌వాలీ గ్రూప్ చిట్‌ఫండ్ స్కాంలో టీఎంసీ ఎంపీ సందీప్ బందోపాధ్యాయ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా టీఎంసీ ఎంపీ తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయపై నిరాధారమైన ఆరోపణలు మోపారని ఆయన తరపు న్యాయవాది రాజ్‌దీప్ మజుందార్ అన్నారు. కోర్టు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బందోపాధ్యాయను రాజకీయంగా అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. బందోపాధ్యాయ‌కు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని వివరించారు. ఆయనను డాక్టర్లకు చూపించాల్సి ఉందని చెప్పారు. కాగా, 15 వేల కోట్ల రోజ్ వ్యాలీ గ్రూప్ కుంభకోణం కేసులో బందోపాధ్యాయను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో టీఎంసీకే చెందిన తపస్ పాల్‌ను డిసెంబర్ 30న అదుపులోకి అరెస్టు చేశారు.

NO COMMENTS

Leave a Reply