బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రిలో బోగ‌స్ రీసెర్చ్

basava2

‘‘బ‌స‌వ‌తారకం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో బోగ‌స్ రీసెర్చ్ న‌డుస్తోంది. రీసెర్చ్ చేయ‌కుండానే డేటా చూయిస్తున్నారు. ఈ విషయమై ఆసుపత్రి బోర్డుకు లేఖలు రాసినా ఫలితం లేదు. ఈ విష‌యం ఆసుప‌త్రి చైర్మ‌న్ బాల‌కృష్ణ దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేదు. చీఫ్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని బసవ తారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, రీసెర్చి సంస్థకు చెందిన డాక్టర్ ప్రసాద్ ఆరోపించారు.

అక్క‌డ కొన్ని విష‌యాలు స‌ర‌యిన ప‌ద్ద‌తిలో జ‌ర‌గ‌డం లేద‌ని, ప్ర‌శ్నిస్తే త‌మ‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నార‌ని, ఒంట‌రిని చేసి వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని, బెదిరిస్తున్నార‌ని ప్ర‌సాద్ ఆరోపించారు. త‌న‌కే కాకుండా ఆసుప‌త్రిలోని సైంటిస్టులు, స్కాల‌ర్స్ ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న ఓ టీవీ ఛాన‌ల్ లో ఆరోపించారు. ప్ర‌భుత్వం నుండి అనేక రాయితీలు తీసుకుంటూ .. ప్ర‌జ‌ల నుండి, ఎన్నారైల నుండి పెద్ద ఎత్తున విరాళాలు వ‌సూలు చేసి న‌డుస్తున్న ఆసుప‌త్రి మీద ఈ ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఆరోప‌ణ‌ల మీద స‌మ‌గ్ర ద‌ర్యాప్తు నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌కు అస‌లు విష‌యాలు చేరేలా చూడాలి.

NO COMMENTS

Leave a Reply