మ‌న నెత్తిన ఇంకో బండ వేయ‌నున్న బ్యాంకులు

atm

రోజుకు రూ.4500 తీసుకోవ‌చ్చ‌నే ఆదేశాలు ఖాతాదారుల‌ను సంతోషంలో న‌డిపిస్తుండ‌గా తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న ఇబ్బందిక‌రంగా మారేలా క‌నిపిస్తోంది. తమపై ఆర్థికభారం పడుతున్న నేపథ్యంలో ఏటీఎం కార్డుల సర్వీస్ చార్జీలు పెంచాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆర్బీఐని కోరడం ఖాతాదారుల జేబుగుల్ల చేసే పరిణామంగా చెప్తున్నారు.

బ్యాంకర్లు ఏటీఎంలను రెండురకాలుగా వర్గీకరిస్తుంటారు. బ్యాంకుబ్రాంచ్‌ల ప్రాంగణంలో ఉండే ఏటీఎంలను గ్రీన్ ఏటీఎం అని, ఇతరప్రాంతాల్లో ఉండే వాటిని వైట్ ఏటీఎంలని బ్యాంకులు విభజించుకున్నాయి. బ్యాంకుప్రాంగణంలో లేని వైట్ ఏటీఎంల సంఖ్య ఏటా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటినిర్వహణ భారంగా మారిందని పేర్కొంటూ ఇందుకోసం ఏటీఎం చార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని రాష్ట్ర బ్యాంకర్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌కు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఈ పరిణామాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఇటీవల కొన్నిబ్యాంకుల ఏటీఎంకార్డులు వైరస్ బారిన పడినట్టు తేలిన నేపథ్యంలో సదరు కార్డులను మాగ్నటిక్ కార్డుల కంటే స్మార్ట్ చిప్‌లతో పునరుద్ధరణ చేయాలని రాష్ట్రంలోని బ్యాంకులకు ఆర్బీఐ సూచించినట్టు సమాచారం. ఈ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఏ బ్యాంకుకు చెందినవి అనే విషయంలో వివరాలు వెలువడికానప్పటికీ మాల్‌వేర్ కష్టాలు ఎదురుకాకుండా ఉండేందుకు తగుచర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించినట్టు చెప్తున్నారు.

NO COMMENTS

Leave a Reply