బాల‌య్య పంచ్ కి బిక్క‌చ‌చ్చిన రేవంత్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అత్యుత్సాహం మీద ఆంధ్రా టీడీపీ ఎమ్మెల్యే, చంద్ర‌బాబు బావ‌మ‌రిది బాల‌కృష్ణ నీళ్లు చ‌ల్లారు. బాల‌కృష్ణ అన్న మాట‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క బిక్కచ‌చ్చిపోయాడు. త‌న తాజా చిత్రం గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమా విడుద‌ల నేప‌థ్యంలో ఆ సినిమా ప్ర‌త్యేకంగా చూసేందుకు రావాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను కోరేందుకు బాల‌కృష్ణ తెలంగాణ అసెంబ్లీకి వ‌చ్చాడు.

బాల‌కృష్ణ వ‌స్తున్న స‌మాచారం తెలుసుకున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ గేటు వ‌ద్ద‌నే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. బాల‌కృష్ణ రాగానే ప‌సుపురంగు పూల‌తో కూడిన బొకేను చేతికి ఇచ్చి ‘వెల్ కం టూ తెలంగాణ అసెంబ్లీ’ అని అన్నాడు. అస‌లే బాల‌య్యది అతి ఆవేశం .. త‌న పార్టీలో ఉన్న వ్య‌క్తి అలా మాట్లాడే స‌రికి 24 గంట‌లు ఆన్ లో ఉన్న‌ది బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

‘‘నేను క‌ళాకారుడిని.. నాకు రాష్ట్రాల‌తో సంబంధం ఏంటి ..నేను రెండు రాష్ట్రాల క‌ళాకారుడిని.. ఇలా వేరు చేసి మాట్లాడ‌డం స‌రికాదు’’ అంటూ రేవంత్ కు మొహం మీదే చెప్పాడు. దీంతో తిరిగి ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క తెల్ల‌మొహం వేయ‌డం రేవంత్ వంత‌యింది. అయినా ఆంధ్రా నేత‌ల గురించి … నంద‌మూరి కుటుంబం గురించి అంద‌రికి తెలిసిందే. న‌టించ‌మంటే జీవిస్తారు .. ఎంత తెలంగాణ‌లో రేవంత్ కు ఫ్రీడం ఇస్తే మాత్రం ఇంత అత్యుత్సాహం ప‌నికిరాద‌ని తెలీదేమో పాపం.

balaiah

NO COMMENTS

Leave a Reply