కేసీఆర్‌ను సేమ్ టు సేమ్ కాపీ కొట్టేసిన బాబు

babu-on-rachabanda kcr-on-rachabanda

ప్ర‌జ‌ల మ‌నిషిగా నిరూపించుకునే కేసీఆర్ స్టైల్‌ను బాబు కాపీ కొట్టారా? అంటే అవును నిజంగానే కొట్టేశారు అనేది పై రెండు ఫొటోలు చూస్తుంటే స్ప‌ష్టం అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న ద‌త్త‌త గ్రామమైన ఎర్ర‌వ‌ల్లిలో అంద‌రికీ డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించి గత డిసెంబ‌ర్‌లో సామూహిక గృహ‌ప్ర‌వేశం చేయించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సింప్లిసిటీని ఓ రేంజ్‌లో ఇష్ట‌ప‌డే కేసీఆర్ ఆ గ్రామంలో న‌డుచుకుంటూ వెళ్లే కేసీఆర్ అలా దారి వెంట వెళ్తూ అక్క‌డే ఉన్న రావిచెట్టు ద‌గ్గ‌ర కూర్చున్నారు. ఆ ఫొటో బాగా పాపుల‌ర్ అయింది. ఒక సీఎం ఎంత సింపుల్ గా కూర్చుండిపోయార‌ని చ‌ర్చ జ‌రిగింది. అయితే ఇపుడు బాబు సైతం అదే రీతిలో ర‌చ్చ‌బండ అనేద‌గిన లోకేష‌న్‌లో భైఠాయించి కాపీ కొట్టేశారు. కాపీ ఎలా చేశార‌ని ఎలా చెప్తారంటే బాబు గ‌తంలో ఏనాడూ ఇలా ప్ర‌జ‌ల మ‌నిషిగా చెట్ల ద‌గ్గ‌ర కూర్చొని ముచ్చ‌టించిన సంద‌ర్భాలు లేవు కాబ‌ట్టి!
తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ నూతన భవనాన్ని చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రావిచెట్టు వ‌ద్ద కూర్చున్న చంద్ర‌బాబు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆయన నేరుగా ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్రకృతి, తల్లిదండ్రులు మనకెన్నో ఇచ్చారు.. అలాగే పెద్దలు, గురువులు జ్ఞానాన్ని పంచారు. వీరందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని కూడా ఈ సారి జన్మభూమిలో చేపట్టినట్లు వెల్లడించారు. తొలుత ప్రకృతికి, ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వా జ్ఞానాన్నిచ్చిన గురువులు, పెద్దలు, ఆ తర్వాత సమాజం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ సభల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని ప్రజలకు చంద్ర‌బాబు సూచించారు.

NO COMMENTS

Leave a Reply