కేసీఆర్ ఈ ప‌నిచేస్తాడ‌ని అనుకోలేదు

bac

సాధార‌ణంగా అసెంబ్లీ స‌మావేశాలు అంటే ఎలా ఉంటుది? ప‌్ర‌తిప‌క్షం స‌మావేశాల‌ను ఎక్కువ రోజులు నిర్వ‌హించాల‌ని కోర‌డం, అందుకు అధికార‌ప‌క్షం నో చెప్ప‌డం వంటివి ఉంటాయి. అదే రీతిలో తెలంగాణ జ‌రుగుతుంద‌నుకునే వారికి షాకిచ్చే వార్త ఇది. తెలంగాణ శాసనసభ సమావేశాలు జనవరి 11 వరకు పొడిగించారు. ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జనవరి 3, 4, 5, 6 ,9, 10, 11 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3న మత్స్య సంపద అభివృద్ధి, 4న బోధన రుసుములు, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌ని ప్ర‌తిప‌క్షాల ఎక్కువ రోజుల పాటు స‌భ నిర్వ‌హించాల‌ని కోరాయి. ఎలాగూ ప్ర‌భుత్వం నో చెప్తుంద‌ని భావించాయి. కానీ సీఎం కేసీఆర్ ఇందుకు భిన్నంగా నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం ఇలా చేస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు అనుకోలేదేమో!

NO COMMENTS

Leave a Reply