చేనేత అంబాసిడ‌ర్ గా స‌మంత !

samantha

తెలంగాణ చేనేత రంగానికి చేయూత‌గా నిలిచేందుకు ప్ర‌ముఖ సినీన‌టి, నాగార్జున కాబోయే కోడలు స‌మంత ముందుకు వ‌చ్చింది. రాష్ట్ర చేనేత సహకార సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సమంత ఆమె అంగీకారం తెలిపారు. ఈ రోజు ఆమె మంత్రి కేటీఆర్ ను క‌లిశారు.
చేనేత రంగానికి తనవంతు సహకారం అందిస్తాన‌ని, చేనేత సహకార సంస్థ టీఎస్‌సివో కార్యక్రమాలతో కలిసి పనిచేస్తానని సమంత ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సమంతకు పోచంపల్లి చీరను బహూకరించారు. తాజాగా నాగార్జున కుమారుడు నాగ‌చైత‌న్య‌తో నిశ్చితార్థం జరుపుకున్న న‌టి సమంతకి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

NO COMMENTS

Leave a Reply