రాములమ్మ ఎంట్రీకి రంగం సిద్ధ‌మైంది

Vijayashanthi

టాలీవుడ్ ఒక‌నాటి టాప్ హీరోయిన్‌, ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవ‌లి కాలంలో తెర‌మీద ఎక్క‌డ క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. కొద్దికాలం క్రితం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణించిన స‌మ‌యంలో చెన్నై వెళ్లిన విజ‌య‌శాంతి త్వ‌ర‌లో తెర‌మీద‌కు రానుంద‌ని స‌మాచారం.

సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం విజయశాంతి ప్రధాన పాత్రలో ఓ భారీ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథ అని తెలిసింది. ఈ సినిమాకు విజయశాంతి నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని… త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం.ఈ మూవీ వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తారని చెప్తున్నారు.

తెలుగు సినీరంగంలో హీరోయిన్‌గా చ‌క్క‌టి కెరీర్ సొంతం చేసుకున్న విజ‌య‌శాంతి అనంత‌రం ‘ఒసేయ్ రాములమ్మ’ పేరుతో లీడ్ రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అదే తరహా సినిమాలు చాలా చేసింది విజయశాంతి. అయితే రానురాను ఆమె క్రేజ్ అంతకంతకూ తగ్గిపోవడం… రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు వదిలేసింది. అయితే గత కొంతకాలంగా ఆమె రాజకీయాల నుంచి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది. ఓ దశలో చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లోనూ విజయశాంతి నటిస్తుందన్న ప్రచారం కూడా జరిగింది కానీ అవేవీ నిజం కాలేదు.

NO COMMENTS

Leave a Reply