ప్ర‌ధానిగా మోడీ స్థానంలో అద్వానీ?

Lk advani

పెద్ద నోట్ల ర‌ద్దు ఎపిసోడ్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మెడ‌కు చుట్టుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌తిప‌క్షాలు మ‌రో కొత్త డిమాండ్‌ను తెర‌మీద‌కు వ‌చ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, దీనికి ప్రధాని మోడీనే కారణమని ఆరోపించారు.

ప్రస్తుత పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించాలంటే ప్రధాని పీఠం నుంచి మోడీని తప్పించాలని, ఆ స్థానంలో అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ వీరిలో ఒకరిని కూర్చోబెట్టాలని మ‌మ‌తాబెన‌ర్జీ సూచించారు. అంతేకాకుండా జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని, పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలతో దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. రోస్‌వ్యాలీ చిట్‌ఫండ్ స్కాంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో మమత కేంద్రంపై మరింత దూకుడును పెంచారు.

NO COMMENTS

Leave a Reply