About Us

మీడియా ఒక ఆయుధం.
మీడియా ఒక అవసరం.
రాజుల కాలంలో వేగులు మీడియా. కొంతకాలానికి పావురాలు మీడియా. కొంతకాలం గోడపై రాతలు. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాక ప్రింటింగ్ తో పేపరు మీడియా. టీవీలు కనిపెట్టాక ఎలక్ర్టానిక్ మీడియా, కంప్యూటరు కనిపెట్టాక డిజిటల్ మీడియా. మాధ్యమం మారింది గాని మనిషి ఉనికి ఉన్నప్పటి నుంచి మీడియా ఉంది. మీడియా వాహికే మారుతూ వస్తోంది. సమాచారం మనిషి బలం. సమాచారం అభివృద్ధి సాధనం. నాలుగు విషయాలు తెలుసుకోవడమే జ్ఞానం, ఆ నాలుగు విషయాలే తెలిపేదే మీడియా.
ఆధునిక ప్రపంచంలో మనిషి జీవనాన్ని టెక్నాలజీ నుంచి ముఖ్యంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి వేరు చేసి చూడలేం. అందుకే ఆ టెక్నాలజీయే వేదికగా, బంగారు తెలంగాణ సాధనయే లక్ష్యంగా www.madeintg.com మీ ముందుకు తెస్తున్నాం. సంచలనాల సెంట్రిక్ గా కాకుండా సమాచారం సెంట్రిక్ నడిచే మా ఈ ఈ-పత్రికను నిరంతరం మీకందుబాటులో ఉంచుతున్నాం.
మీ ఆదరణ కోరుతూ…
ఎడిటర్
మేడిన్ టీజీ.కామ్ !